Dharmendra : బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ముంబై బ్రీచ్ కాండీ హాస్పిటల్ నుంచి బుధవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఇది సినీ అభిమానులకు, ఆయన్ని అభిమానించే వారికి సంతోషాన్ని కలిగించే వార్తనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్‌గా నేషనల్ మీడియాలో ధర్మేంద్ర చనిపోయారంటూ వచ్చిన వార్తలు ఎంత సెన్సేషనల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్రంగా ఖండించారు. ధర్మేంద్ర ట్రీట్‌మెంట్‌కు రెస్పాండ్ అవుతున్నారని, ఆయన చనిపోయినట్లు వార్తలను పుట్టించటం అనైతికమని హేమా మాలిని, ఈషా డియోల్, సన్నీ డియోల్, బాబీ డియోల్ సహా అందరూ ఖండించారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రత్యేకంగా వెళ్లి ధర్మేంద్ర కుటుంబ సభ్యులను కలిశారు.
ధర్మేంద్ర ఆరోగ్యం కుదుట పడటంతో ఆయన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు వైద్యులు. వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమ్యస్యలతో ఈ సీనియర్ యాక్టర్ రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటున్నారు. అందులో భాగంగా ఈ నెల 5న ఓసారి బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. తర్వాత మరోసారి జాయన్ కావటంతో ధర్మేంద్రకు సీరియస్ అనే వార్తలు వచ్చాయి. ఏకంగా నేషనల్ మీడియా అయితే ఆయన చనిపోయనట్లు న్యూస్ ప్రచురించేసింది. దీనిపై బాలీవుడ్ వర్గాలు సైతం ఫైర్ అయ్యాయి.


