Govinda : బాలీవుడ్ సినీ వర్గాలకు అనుకోని షాక్ తగిలింది. బాలీవుడ్ నటుడు గోవింద (61) అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మంగళవారం సీనియర్ నటుడు ధర్మేంద ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటుంటే వెళ్లి గోవింద పరామర్శించాడు. అయితే అర్ధరాత్రి గోవింద ఉన్నట్లుండి కుప్ప కూలిపోయాడు. వెంటనే ఆయన్ని ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సన్నిహిత వర్గాలంటున్నాయి.
80వ దశకంలో ఫ్యామిలీ, యాక్షన్ సినిమాలంటూ అన్నీ రకాల సినిమాల్లోనూ నటించిన తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. మంచి డాన్సర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. 1992లో దివ్యభారతితో నటించిన షోలా ఔర్ షబ్నమ్ సినిమాతో కామెడీ హీరోగా మారారు. అక్కడి నుంచి కామెడీ స్టార్ గా వరుస విజయాలను సాధించారు. తర్వాత 2000 నుంచి ఆయన్ని మళ్లీ పరాజయాలు పలకరించాయి. ఆ దశలో ఆయన పలు టీవీ షోస్‌లో డాన్స్ ప్రోగ్రామ్స్ కి న్యాయ నిర్ణేతగానూ వ్యవహరించారు.
2014లో సినిమాల్లో నటిస్తూనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మహారాష్ట్రలోని నార్త్ ముంబై నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికయ్యారు.


