Salman Khan Health Issues: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే రెండు విషయాలు గుర్తుకు వస్తాయ. ఒకటి ఆయన హల్క్ బాడీ… రెండోది ఆయన ఇంకా పెళ్లి చేసుకోకపోవటం. 59 ఏళ్లు వయసు అవుతున్నప్పటికీ ఇంకా సల్మాన్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు తన పెళ్లిపై సల్మాన్ నేరుగా ఎప్పుడూ స్పందించలేదు. అయితే రీసెంట్‌గా కపిల్ శర్మ టాక్ షోలో ఆయన తన పెళ్లిపై స్పందించారు. వివాహం చేసుకోవటం, విడాకులు తీసుకోవటం అనేవి మనిషిని ఎమోషనల్‌గా ఇబ్బంది పెడతాయని సల్మాన్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఈ భాయ్ జాన్ తన ఆరోగ్య సమస్యలపై కూడా స్పందించారు. తాను బ్రెయిన్ ఎన్యోరిజమ్, ఏవీ మాల్ఫోర్మేషన్‌లతో ఇబ్బందిపడుతున్నట్లు తెలియజేశారు సల్మాన్.
సల్మాన్ స్పందిస్తూ ‘సినిమా రంగంలో రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల్లో నటించేటప్పుడు గాయాలవుతుంటాయి. ముఖంలో వచ్చే తీవ్రమైన నొప్పి (ట్రైజెమినల్ న్యూరల్జియా), రక్తనాళాల్లో నెలకొన్న అసాధారణ పరిస్థితి (మాల్ఫోర్మేషన్), మెదడులో వచ్చే చిన్నపాటి ఇబ్బంది (బ్రెయిన్ ఎన్యోరిజమ్) వంటి సమస్యలతో బాధపడుతున్నప్పటికీ నేను నా వర్క్‌ను ఎప్పుడూ ఆపలేదు. విరామం తీసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. ఇప్పటికీ వీటితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాను. చిన్నతనం నుంచి ఈ సమస్యలుంటే అధిగమించేవాడిని. వీటి నుంచి బయటపడటానికి నన్ను నేను రీస్టార్ట్ చేసుకుంటున్నా’ అన్నారు. సల్మాన్ ఇలా తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను చెప్పటంతో ఇప్పుడు ఆయన అభిమానులు అసలు భాయ్ జాన్‌కు ఏమవుతుందోనని టెన్షన్ పడుతున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/ananthika-romantic-drama-8-vasanthalu-ott-partner-locked/
ఆమిర్ ఖాన్ గురించి సల్మాన్ మాట్లాడుతూ ‘ఆమిర్ ఎంత పర్‌ఫెక్షనిస్ట్ అనేది అందరికీ తెలుసు. పెళ్లి విషయంలోనూ ఈ పర్‌ఫెక్షనిజం వచ్చే వరకు బంధాలను కొనసాగించేలా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కొనసాగిస్తున్న బంధమే ఆయన చివరి లవ్‌స్టోరీ కావచ్చు. ఈసారి లవ్‌లో పర్‌ఫెక్షనిస్ట్ అవుతారనే భావిస్తున్నాను’ అంటూ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు. సల్మాన్ ఖాన్‌కు మంచి హిట్ మూవీ వచ్చి చాలా రోజులే అవుతుంది. ఆయన అభిమానులు సల్మాన్ నుంచి సూపర్ హిట్ మూవీని ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌తో పాటు సౌత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నాలను సల్మాన్ చేసినప్పటికీ అవేవీ వర్కవుట్ కాలేదు. ఆయన లేటెస్ట్ మూవీ సికిందర్ కూడా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
సల్మాన్ ఖాన్ యుక్త వయసులో ఉన్నప్పుడు చాలా మంది హీరోయిన్స్‌తో ప్రేమాయణం నడిపినవాడే. కానీ అవేవీ పెళ్లి వరకు వెళ్లలేదు. ఐశ్వర్యారాయ్‌ని కూడా ఓ సందర్భంలో ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఏమైందో ఏమోకానీ.. వారిద్దరూ విడిపోయారు. సల్మాన్ సింగిల్‌గా ఉండిపోతే, ఐశ్వర్యరాయ్ మాత్రం అభిషేక్‌ను వివాహం చేసుకుంది. తర్వాత కత్రినా కైఫ్‌తోనూ ప్రేమలో మునిగి తేలారు. కానీ అది కూడా పెళ్లి వరకు వెళ్లలేకపోయింది.