Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభBrahmanandam : మరోసారి తాత అయిన బ్రహ్మానందం..

Brahmanandam : మరోసారి తాత అయిన బ్రహ్మానందం..

- Advertisement -

Brahmanandam : హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇప్పుడు సినిమాలు తగ్గించేశారు. అడపాదడపా ఎప్పుడో ఒక సినిమాలో కనిపిస్తూ ఇంటి దగ్గరే ఉంటూ ఫ్యామిలీతో సమయాన్ని వెచ్చిస్తున్నారు. అప్పుడప్పుడు బ్రహ్మ్మనందం తన మనవడితో ఆడుకుంటున్న ఫోటోలు బ్రహ్మానందం తనయుడు, హీరో రాజా గౌతమ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు.

తాజాగా బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ భార్య ఇటీవల కొన్ని రోజుల క్రితం ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఈ విషయన్ని రాజా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తన కొడుకు ఆ చిన్న పాపతో ఆడుకుంటున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మా హ్యాపినెస్ డబల్ అయిందని పోస్ట్ చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు, బ్రహ్మానందం అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad