Thursday, March 13, 2025
Homeచిత్ర ప్రభBrahma Anandam: ఓటీటీలోకి ‘బ్రహ్మా ఆనందం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

Brahma Anandam: ఓటీటీలోకి ‘బ్రహ్మా ఆనందం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌత‌మ్‌లు కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం'(Brahma Anandam). ఈ మూవీలో బ్రహ్మానందం, గౌతమ్‌లు తాత మనవడిగా సందడి చేశారు. ఆర్‌.వి.ఎస్ నిఖిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ కీలక పాత్ర‌లను పోషించారు. స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

- Advertisement -

థియేటర్లలో బ్రహ్మానందం యాక్టింగ్‌, కామెడీ టైమింగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆస్తి కోసం తాత పెట్టిన కండిషన్లు మనవడు ఎలా క్లియర్‌ చేశాడనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫుల్ కామెడీతో పాటు ఎమోషన్‌ సీన్స్ కూడా చక్కగా చూపించారు. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. ఆహా వేదికగా మార్చి 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుందని టీమ్‌ వెల్లడించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News