Monday, January 13, 2025
Homeచిత్ర ప్రభBrahmamudi January 13th Episode: స్వప్న సీమంతం చెడగొట్టే ప్లాన్‌లో రుద్రాణి, రాహుల్.. కావ్య కి...

Brahmamudi January 13th Episode: స్వప్న సీమంతం చెడగొట్టే ప్లాన్‌లో రుద్రాణి, రాహుల్.. కావ్య కి మళ్లీ అవమానం తప్పదా..

ఈరోజు ఎపిసోడ్‌లో రాహుల్ తాతయ్య హాస్పిటల్ బిల్ చెక్‌లో కాదు, క్యాష్‌లో పే చేశారు అని రుద్రాణితో చెప్తాడు. అప్పుడు ఎందుకలా చేస్తారు అని ఆలోచిస్తారు. కావ్య, రాజ్ ఏదో చేస్తున్నారు ఆఫీస్ అకౌంట్‌లో డబ్బులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని ప్లాన్‌లు వేస్తారు. మరోవైపు స్వప్న నా సీమంతం విషయంలో ఎందుకిలా చేశావు అని కావ్యని నిలదీస్తుంది. అమ్మ నీ సీమంతం అక్కడ చేద్దాం అనుకుంది మరి నన్ను అడుగుతావేంటీ అంటుంది కావ్య. అమ్మకి ఆ ఆలోచన వచ్చేలా చేసిందే నువ్వు అంటుంది స్వప్న. ఇంత తెలుసుకున్నదానివి ఎందుకిలా చేస్తున్నానో తెలుసుకోలేవా అక్కా అంటుంది కావ్య. సొంత అక్క సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదు అని తెలుస్తుంది. ఏ ఆడపిల్ల అయినా తన సీమంతం గొప్పగా జరగాలని కోరుకుంటుంది నువ్వు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు అని స్వప్న అంటుంది.

- Advertisement -

అందరికోసం ఆలోచించేదానివి అయితే అందరి సంతోషంగా ఉండాలని అనుకోవాలి. ఆస్తి నీ పేరు మీద ఉంది కాబట్టి నువ్వు చెప్పిందే జరగాలని చూస్తున్నావు. నీ కన్నా మా అత్తగారే నయం అంటుంది అప్పుడు కావ్య నేను రాక్షసిని కాదు నాదు రాయు గుండె కాదు నన్ను ఇలా నిందించవచ్చు అర్థంచేసుకో అంటుంది. స్వప్న అక్కడి నుంచు వెళ్లిపోయాక అపర్ణ వస్తుంది రండి అత్తయ్య మీరు కుడా నన్ను ఏమైనా అనాలి అనిపిస్తే అనేయండి అంటుంది. అసలు ఎందుకిలా చేస్తున్నావు ఏమి సాధిస్తామని అని అడుగుతుంది. నీ అంతట నీవు చెప్పేదాక ఏమి ఇబ్బంది పెట్టను అంటుంది అపర్ణ. సీమంతానికి కావాల్సిన లిస్ట్ రాయాలి రా అని పిలిచి వెళ్లిపోతుంది.

Image Credits: Disney +hotstar

మరోవైపు కనకం సీమంతానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది. సీమంతం చేయడానికి వచ్చిన ఈవెంట్స్ వాడితో గీసి గీసి బేరాలు ఆడుతుంది కనకం, కేవలం రూ.20 వేల బడ్జెట్‌తోనే ఘనంగా చేయాలి అంటుంది. అక్కడ రాజ్ ఏమో పాపం దూరం నుంచే పెళ్లానికి లైన్ వేసుకుంటాడు. రాజ్ ఆత్మ వచ్చి తను నీ పెళ్లామేరా వెళ్లి వాటేసుకొంటే ఏమి కేసు పెట్టదు అంటాడు. అలా చేస్తే చీప్ అయిపోతాము అంటాడు రాజ్. అసలు టచ్ ఏ చేయకపోతే ఇంకా చీప్ అయిపోతావు అంటాడు రాజ్ ఆత్మ. సరే అని ఏదోలా కావ్యనని పట్టుకుని సిగ్గుతో వదిలేస్తాడు. అప్పుడు కావ్య చిరాకుపడి ఏంటి ఏదో చెప్పాలనుకుంటునారు అంటే అక్కడ మీ అమ్మ సీమంతం ఏర్పాట్లు ఎలా చేస్తుంది అని అడుగుతాడు. మా అమ్మ బడ్జెట్లో ఏదోలా ప్లాన్ చేస్తుందిలే అని చెప్తుంది కావ్య. మరోవైపు స్వప్న సీమంతం సింపుల్‌గా జరుగుతుందని బాధ పడుతుంది. రుద్రాణి, రాహుల్ వచ్చి ఇంకా రెచ్చగొడతారు. నీ ఆశలు అన్నీ తీర్చుదామం అనుకున్నాము కానీ మీ చెల్లి చెడగొట్టింది అని రుద్రాణి అంటుంది. నా చెల్లి మీద కంప్లయింట్ చేయడానికి వచ్చారా అంటుంది స్వప్న. మొత్తం మీద రుద్రాణి, రాహుల్ స్వప్న బుర్రని మొత్తం తినేస్తుంది. ఈ మాటలకు స్వప్న మైండ్ అంతా పాడైపోయి ఆలోచిస్తూ ఉండిపోతుంది. అక్కడ కనకం ఇంట్లో సీమంతం ఏర్పాట్ల హడావిడిగా చేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News