Wednesday, January 15, 2025
Homeచిత్ర ప్రభBrahmamudi January 15th Episode: సీమంతంలో ప్లాస్టిక్ ఫ్రూట్స్ పెట్టావేంటి కనకం.. రుద్రాణి పళ్లు విరిగిపోయాయి..

Brahmamudi January 15th Episode: సీమంతంలో ప్లాస్టిక్ ఫ్రూట్స్ పెట్టావేంటి కనకం.. రుద్రాణి పళ్లు విరిగిపోయాయి..

ఈరోజు ఎపిసోడ్‌లో స్వప్న సీమంతం కోసం దుగ్గిరాల కుటుంబం అంతా కనకం ఇంటికి వస్తారు. బయట నుంచే ఏర్పాట్లు బాగనే చేశారు అంటే దానికి రుద్రాణి హా అవును వాళ్ల స్థాయి కనిపిస్తుంది అంటుంది. నలుగురు నాలుగు మాటలు అని రుద్రాణి నోరు మూయిస్తారు. లోపలికి వెళ్దాం అనుకుంటుంటే స్వప్న తన గోల్డ్ నెక్లేస్ మర్చిపోయాను అని చెప్తే నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావ్ లే అమ్మ నీకేందుకు ఇంక నెక్లేస్‌లు అంటాడు సుభాష్. నా కోడలు బాగానే ఉంది కానీ కావ్య పేదరికానికి కేరాఫ్ అడ్రెస్‌లా ఉన్నావు అంటుంది రుద్రాణి. ఏమైనా వేసుకోని రావచ్చు కదా బోలడన్ని ఉన్నాయి మా పరువు తాయడానికా అని ధాన్యలక్ష్మి అంటుంది. సీమంతానికి వచ్చి ఇవేమి మాటలు అని పెద్దావిడ ఇద్దరినీ తిడుతుంది. అపర్ణ కుడా ఎందుకు వేసుకోలేదు కావ్య అని అడుగుతుంది. అప్పుడు కావ్య వేసుకుందాం అనుకున్నాను కంగారులో మర్చిపోయాను అంటుంది. రాజ్‌ని వెళ్లి తీసుకురమ్మాంటారు అందరూ, అయినా అక్కర్లేదు నాకు ఇలానే బాగుంది అంటుంది కావ్య.

- Advertisement -

ఇంటికి వచ్చిన వాళ్లని కనకం లోపలికి ఆహ్వానిస్తుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మి ఏర్పాట్ల కోసం పేర్లు పెడతారు. మిగతా వాళ్లు అంతా కనకంకు సపోర్ట్ చేసి రుద్రాణికి గడ్డి పెడతారు. మా మాట వదిలేసి కనీసం స్వప్నకు అయినా ఏర్పాట్లు నచ్చయా? అని రుద్రాణి అడుగుతుంది. దానికి స్వప్న సీమంతం ఇక్కడ అని తెలిసినప్పుడే నా ఆసు చచ్చిపోయాయి అని చెప్తుంది. అప్పుడు స్వప్న దగ్గరకు కావ్య వెళ్లి ఎందుకిలా చేస్తున్నావు అని అడుగుతుంది. అక్కడ అంత ఘనంగా జరగాల్సింది ఇక్కడ ఇలా జరుగుతుంటే హ్యాపీ అవ్వాలా అంటుంది స్వప్న. దానికి కావ్య ఎంత ఘనంగా చేసినా వచ్చిన వాళ్లు ఏదోక పేరు పెట్టి వెళ్ళిపోతారు వాళ్లందరూ డబ్బున్న వాళ్లే మంచి మనసు ఉన్న వాళ్లు కాదు అంటుంది. పేమెంట్స్ ఇచ్చే గెస్ట్ వాళ్లు కానీ ఇక్కడ మన మంచి కోరుకునే వాళ్ళు ఉంటారని అంటుంది.

Image Credits: Disney+hotstar

ఇక్కడ నాన్న తటాకులతో పందిరి వేసినా, అమ్మ మామిడాకులతో తోరణాలు కట్టినా అది మన మంచి కోసం, మన మూలాలను గుర్తుచేస్తుంది. డబ్బు కోసం, పద్ధతులను, ప్రేమను చూసి రావాలి అంటుంది. మనకు ఈ ఇంట్లో ఎన్ని మెమరీస్ ఉన్నాయి చెప్పు ఇక్కడ వాళ్లందరూ మనకు తెలిసిన వాళ్లు ఇక్కడ జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ జరిగితే నీకు అందురూ తెలిసిన వాళ్లు వస్తారు. నీకు సంతోషంగా ఉంటుంది అంటుంది. ఆ మాటలకు స్వప్న ఆనందపడి అన్నీ గుర్తుచేసుకుని థాంక్స్ కావ్య.. ఇక్కడికి తీసుకొచ్చి మంచి పని చేసావు. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటుంది.

కనకం చేసిన ఉప్మా టిఫిన్ తినలేక ధాన్యలక్ష్మి, రుద్రాణి తిట్టుకుంటారు. అందుకే శ్రీమంతం కుర్చీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ తింటాను తీసుకోబోతుంది. అప్పుడు ఈవెంట్ మ్యానేజర్ అవి తినద్దు అని చెప్పి చేయి లాగుతాడు నా చేయి పట్టుకుంటావా అని చెంప మీద కొడుతుంది. ఎవరు చెప్పినా వినకుండా ఫ్రూట్ తీసుకుని తింటుంది. ప్లాస్టిక్ ఫ్రూట్ అని తెలిసి తిడుతుంది. మరోవైపు రాజ్ కావ్య‌ను గదిలోకి పిలుస్తుంది. ఇద్దరూ ఇది మన ఫస్ట్ నైట్ గది అంటూ మాట్లాడుకుంటారు. కావ్యను దగ్గరకు లాక్కొని నీకోసం ఒకటి తీసుకొచ్చాను అని రాజ్ చెప్తే కావ్య ఏం తెచ్చారు అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News