ఈరోజు ఎపిసోడ్‌లో గెస్ట్‌హౌస్ ఎందుకు తాకట్టు పెట్టామో తెలుసా అని రాజ్ ఇంట్లో నిజం చెప్పాలనుకుంటే మధ్యలో కావ్య ఆగండి మీకు ఏం సంబంధం ఉంది. నేనే తాకట్టు పెట్టాను, రూ.10 కోట్లు తీసుకుంది నేను అంటుంది. వీళ్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటే, రుద్రాణి ఏమో ఇళ్లు ఎగిరినట్టు చూసావా వదిన నీ కోడలు నీ కొడుకుని ఎలా ఆడిస్తుందో అంటే సుభాష్ ఆపి నా కోడలు ఎందుకు నా కొడుకుని ఆపిందో కారణం ఉంటుంది కారణం లేకుండా నా కొడుకు అలా మౌనంగా ఉండడు అంటాడు. అప్పుడు సుభాష్ ఆస్తి నీ పేరు మీద ఉంది కాదు అనడం లేదు కానీ నువ్వు అంత పెద్ద మొత్తం అప్పు తీసుకుంటే తెలుసుకునే హక్కు లేదా అని అడుగుతాడు. నా పేరు మీద పెట్టిన ఆస్తిని ఏదైనా చేసే హక్కు నాకు ఉంది అడిగే హక్కు మీకు లేదు అని మామయ్యకు సమాధానం ఇస్తుంది.
ఆ మాటలకు అపర్ణ లేచి ఎంత దైర్యం ఉంటే మామయ్యకే ఎదురు చెప్తావా అని చెయ్యి లేపితే సుభాష్ అవుతాడు. ఇక రుద్రాణి టైం దొరికిందని ఓ రెచ్చిపోయి మాట్లాడుతుంది. రూమ్‌లోకి వచ్చి కావ్య నన్ను ఏమి అడగరా, దేవుడు లాంటి మావయ్య గారి మీద మాట తూలాను అని బాధపడుతుంటే రాజ్ నిన్ను ఏం అడుగుతా కళావతి మన దురదృష్టం మీద కోపం వస్తుంది ఏమి చేయలేకపోతున్నాము అంటాడు. నేను నిజం చెప్తుంటే చెప్పనివ్వలేదు
నీకు ఇప్పటినుంచి ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. నిన్ను సంతోషంగా చూసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను అంటే కళావతి కన్నీళ్లు పెట్టుకుంటూ రాజ్‌ను కౌగిలించుకుంటుంది. మరోవైపు అనామిక మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ కళ్యాణ్ బాధ పడతాడు. అప్పు వచ్చి ఏమైంది అని అడుగుతుంటే అనామిక అన్న మాటలు గుర్తొస్తున్నాయి అంటాడు. అప్పు కొంచెం దైర్యం చెప్తుంది. ఎంతకీ కళ్యాణ్ మూడ్ మారకపోయేసరికి అప్పు కుడా బాధపడుతుంది. నేను రేపు వెళ్లిపోతానని తెలిసి నువ్వు ఇలా ఉంటే ఎలా అని అడుగుతుంది. అప్పుడు కళ్యాణ్ మనసు మార్చుకుని అప్పుకి అన్నం తినిపిస్తాడు. అక్కడ సుభాష్ దగ్గరికి ప్రకాశం వచ్చి ఇంట్లో ఏమి జరుగుతుంది అర్థంకావట్లేదు ఇంట్లో అందరికి అవమానం జరుగుతుంది ఈ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు అని అడుగుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.