ఈరోజు ఎపిసోడ్లో ప్రకాశం, సుభాష్ కావ్య ప్రవర్తన కోసం మాట్లాడుకుంటారు. కావ్య నన్ను అవమానిస్తే నేను తనని తప్పుపట్టాలా అని సుభాష్ అడుగుతాడు. నన్ను ఎప్పుడు ఒక్క మాట అనని కావ్య అలా మాట్లాడడానికి కారణం ఆలోచిస్తునానే కానీ బాధపడట్లేదు అంటాడు. తను డబ్బు కన్నా మనుషులకే ఎక్కువ విలువ ఇస్తుంది అలాంటి తనని నేను శత్రువులా తీసుకోవాలా అంటాడు. నీ మీద గౌరవంతో నేను ఊరుకున్నా నా భార్యకి నేను సమాధానం చెప్పలేను అని ప్రకాశం వెళ్లిపోతాడు.
అందరూ బోజనం చేయడానికి వస్తే కావ్య వడ్డిస్తుంది అప్పుడు ధాన్యలక్ష్మి, రుద్రాణిలు నువ్వు వడ్డించక్కర్లేదు మాకు చేతులు ఉన్నాయి వడ్డించుకుంటాము అంటారు.
స్వప్న రుద్రాణిలు వాదించుకుంటుంటే కావ్య అపుతుందని దానికి రుద్రాణి మీ చెల్లి చెప్తే ఎవరైనా ఆగాల్సిందే మా పెద్ద అన్నయ్యకి నీకు సంబంధం లేదు అంటే పిల్లిలా మూసుకున్నాడు, అపర్ణ వదిన కుడా కోడల్ని ఏమి అనలేక ఊరుకున్నారు అని అంటుంది. అందుకే వాళ్లు బోజనానికి రాలేదు అంటే ఈలోగా సుభాష్ తినడానికి వస్తారు.
అత్తయ్య తినడానికి రాలేదు అంటే నేను తీసుకెళ్తానులే అంటుంది ఇందిరాదేవి. అది అయ్యాక ధాన్యలక్ష్మి తినడం మానేసి వచ్చేస్తే రుద్రాణి వచ్చి ఏదో తేలుస్తా, రెచ్చిపోతా అన్నావు ఇప్పుడు కనీసం ఏమి అనలేక పోయావు అని ఇంకా రెచ్చగొడుతుంది. మళ్లీ ఇంకో ప్లాన్ వేసి ప్రకాశం అన్నయ్యని వాడుకుని ఆ కావ్య పని చూడు అంటుంది.
మరోవైపు కావ్య సుభాష్ దగ్గరికి వెళ్లి నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అంటుంది. మా అమ్మానాన్న తర్వాత మీరే అర్థం చేసుకున్నారు. మీరు చిన్న మావయ్యతో మాట్లాడింది అంతా విన్నాను అంటుంది. నీ గురించి నాకు తెలుసు కావ్య నా కోడలు ఎప్పుడు తప్పు చేయదు అంటాడు. మరోవైపు అపర్ణ దగ్గరకు ఇందిరాదేవి వచ్చి కావ్య మీద ఎందుకు అంత కోపడ్డావు అంటుంది. ఏ బాధ ఉన్నా మాతో చెప్తే అర్థం చేసుకుంటాము కదా అలా ఎదిరించి మాట్లాడుతుందా అంటుంది. తప్పు తెలుసుకున్న తర్వాత వాళ్లే వచ్చి నీ కాళ్లు పట్టుకుంటారు అప్పుడు క్షమించు చాలు అంటుంది. మీరు అర్థం చేసుకున్నట్టే అది నన్ను అర్థం చేసుకుంటే బాగున్ను అంటుంది అపర్ణ. అక్కడ కావ్య బాధపడుతూ బయట కూర్చొంటే రాజ్ వచ్చి కూర్చొని మాట్లాడుతాడు. ఇద్దరు ఇద్దరి గురించి మాట్లాడుకుని ఆ నంద గురించి ఆలోచిస్తారు. వాడు చస్తే మనకి నష్టం మరి వాడు చస్తే ఎవరికి నష్టం వాడిని చంపారు అని కావ్య అంటుంది. దీనివల్ల ఈ వంద కోట్ల విషయంలో ఎవరికో లాభం ఉంది అందుకే చంపేసారు అంటారు. అక్కడ అనామిక, సామంత్లు నందాని చంపేసి బాగానే రాజ్ని మళ్లీ కష్టాల్లో పెట్టావు అని మాట్లాడుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ పుర్తవుతుంది.