Tuesday, January 7, 2025
Homeచిత్ర ప్రభBrahmamudi January 6th Episode: ప్లాన్ ప్రకారం కిరీటం దొంగతనం చేసిందిగా అనామిక.. ఇప్పుడు దుగ్గిరాల...

Brahmamudi January 6th Episode: ప్లాన్ ప్రకారం కిరీటం దొంగతనం చేసిందిగా అనామిక.. ఇప్పుడు దుగ్గిరాల పరువు ఉంటుందో, ఊడుతుందో…

ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్, కళావతిలు ఆఫీస్‌లో రోజంతా పని చేసి వస్తారు. అపర్ణ ఇద్దరిని భోజనం చెయ్యండి అని పిలిస్తే లేదు మమ్మీ పొద్దున్న నుంచి ఏమి తినలేదు. సాయంత్రం 5 గంటలకే తిన్నాము, మీరు తినండి అని చెప్పి వెళ్లిపోతాడు. వెంటనే రుద్రాణి వాళ్లేమే నచ్చినవి తింటారు మాకు ఈ గడ్డిలాంటి ఆకుకూరలు అంటుంది. ఇవి తినడానికి అంత కర్మ పట్టలేదు అంటూ ధాన్యలక్ష్మి, రుద్రాణి, రాహుల్ అక్కడినుంచి తినకుండా వెళ్లిపోతారు. పది రకాల కూరలు లేకపోయినా ఉన్న ఒక్క కూర అయినా ఆకలి తీర్చుకోవడానికి కదా ఈ విషయం వీళ్లకి ఎందుకు అర్ధంకావట్లేదో నాకు అర్ధంకావట్లేదు అని ప్రకాశం అంటాడు.

- Advertisement -

మరోవైపు కాంట్రాక్ట్ టైంకి ఏడు వారాల నగలు తయారు చేయించి ప్రాజెక్టు పూర్తి చేసినందుకు ఆనందపడి +, రాజి కావ్యను పొగుడుతాడు. తయారు చేసిన నగలను అక్కడే ఆఫీస్ సెక్యూరిటీతో లాకర్‌లో పెట్టిస్తారు. డిజైన్‌లో అనుకున్న నగలు ఇవి ఒకేలా వచ్చాయని అనుకుంటారు. జగదీశ్ గారెకి ఈ నగలు నచ్చుతాయి అని చెప్పుకుంటారు.

మరోవైపు అనామిక కూర్చుని మందు తాగుతూ ఉంటే సామంత్ వచ్చి చేతిలోని మందు గ్లాస్ లాక్కొని రాజ్ ఫ్యామిలీని నాశనం చేస్తానన్నావ్, రోడ్డుకి ఈడుస్తానన్నావు, వాళ్లు అనుకున్నట్టుగా ప్రాజెక్టు పూర్తి చేశారు. డిజైన్ కాపీస్ తెచ్చి ఇమ్మన్నావు ఎక్కడ పాడేశావో తెలియదు అంటాడు. నేను కుడా నీ ప్రవర్తిస్తే నీకు ఓకే నా అంటుంది అనామిక. నువ్వు ముందు అరవడం మానేసి చెప్పేది విను అంటుంది. వెంటనే రాజ్ వాళ్ల ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ కు ఫోన్ చేసి నిన్ను మ్యానేజర్‌గా పీకేసి సెక్యూరిటీ గార్డ్ చేసిన వాళ్ల మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నావనమాట అంటుంది. అలానే అనుకుంటున్నా కానీ అవకాశం లేదు నా తల వ్రాత అలా రాసి పెట్టి ఉంది అంటాడు. సెక్యూరిటీ.

నేను ఇచ్చిన పని చేస్తే నీకు లైఫ్‌టైం సెటిల్‌మెంట్ చేస్తాను అంటుంది. నీకు 50 లక్షలు ఇస్తాను, నేను పంపించిన కిరీటాన్ని అక్కడ పెట్టి ఒరిజినల్ కిరీటాన్ని నాకు పంపించాలి అంటుంది. మీరు చెప్పినట్టే చేస్తాను అంటాడు సెక్యూరిటీ. ప్లాన్ సక్సెస్ అయ్యిందుకు అనామక సామంత్ హ్యాపీగా మందు కొడతారు. నగలకు సంబంధించి ప్రెజెంటేషన్ ఇవ్వాలి దానికి వర్క్ చెయ్యాలి అని కావ్య అంటుంటే, నాకు నిద్ర వస్తుందని రాజ్ పడుకుంటాడు. అక్కడ ఆఫీస్‌లో సెక్యూరిటీ గార్డ్ మిగితా సెక్యూరిటీ గార్డ్స్‌కు టీ లో మత్తుమందు కలిపిచ్చి ఒరిజినల్ కిరీటాన్ని తీసి డూప్లికేట్ కీరిటంతో మార్చి ఇచ్చేస్తాడు. వెంటనే అనామికకు ఫోన్ చేసి చెప్తే అనామిక వాడిని పొగుడ్తుంది. నీకు డబ్బులు రేపు పంపిస్తాను అంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News