Thursday, January 9, 2025
Homeచిత్ర ప్రభBrahmamudi January 7th Episode: అయ్యో అనామిక.. కావ్య నక్కతెలివితో బాగా దెబ్బకొట్టిందిగా..

Brahmamudi January 7th Episode: అయ్యో అనామిక.. కావ్య నక్కతెలివితో బాగా దెబ్బకొట్టిందిగా..

ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ కావాలని లేవకండా నిద్ర పోయినట్టు నటిస్తుంటే కావ్య లేపడానికి ప్రయత్నించి మంచం మీద పడిపోతుంది. ఇంకేముంది వాళ్లిద్దరి సరసాలు సరిపోతాయి. ఇద్దరు రొమాన్స్ లో మునిగిపోతారు.. రాజ్ ముద్దు కోసం తాపత్రయం పడుతుంటే ముద్దు కావాలంటే జీవితాతంతం నా చేయి పట్టుకునే ఉండాలి ఆ నమ్మకం ఉంటేనే పెట్టుకోండి అంటుంది. ఇంక రాజ్ ఆఫీస్ పి ఉందని లేచిపోతాడు. అప్పుడు కావ్య నవ్వుకుంటూ పర్లేదు మా ఆయనలో మార్పు కనిపిస్తుంది అనుకుని సిగ్గుపడుతుంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆఫీస్‌కి కార్లో బయల్దేరతారు. ఆఫీస్‌కి మీ వల్లే లేటు అయింది. మీరు పొద్దున్న లేస్తే ఇప్పుడు ఈ స్పీడ్ అవసరమా అంటుంది. అలా మాటల్లో పడిపోయి ఇంట్లో అవసరమైన ఫైల్ మర్చిపోతారు.

- Advertisement -

అలా రాజ్ ఒక్కడే ఆఫీస్‌కు వెళ్తాడు. కావ్య ఆఫీస్‌కు రాలేదని సెక్యూరిటీ అనామికకు ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు అనామిక కావ్యను కుడా కలిపి ఆ జగదీశ్ తో తిట్టించాలి అప్పుడే నా ఈగో సాటిస్‌ఫై అవుతుంది అనుకుని కావ్యకు కాల్ చేసి రెచ్చగొడుతుంది. అర్జెంట్‌గా వెళ్లి ఆ జగదీశ్‌తో తిట్టు తిను అంటుంది. కాసేపట్లో మీకు అవమానం జరుగుతుంది అది చూసి నేను హ్యాపీ అవ్వాలిగా అంటుంది. లైఫ్ పార్ట్నర్ కదా వెళ్లి షేర్ చేసుకో అంటుంది.ఇద్దరు కలిసి ఏడవండి అని ఫోన్ పెట్టేస్తుంది. కావ్య ఆలోచనలో పడి రాజ్‌కి కాల్ చేస్తుంది అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకుందామని కానీ రాజ్ కాల్ లిఫ్ట్ చేయడు.

ఈలోగా అక్కడ ఆపీస్‌కి జగదీశ్ రావడం నగలు చూసి మెచ్చుకోవడం జరుగుతుంది. ఈ కష్టం అంతా తన భార్య కావ్య‌ది అని చెప్తాడు. తను వచ్చే లోగా ఈ నగలు టెస్టింగ్ చేయిద్దాం అనుకుని చేస్తారు. నగలు టెస్ట్ చేసి ఆభరణాలు బాగానే ఉన్నాయి కానీ ఈ కిరీటం మాత్రం బంగారం కాదు నకిలీ అంటాడు. డమ్మీ కిరీటం అని తేలటంతో మీ తాతయ్య నీ ఫ్రెండ్ కాబట్టి మీకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చాను ఇలా ఫ్రాడ్ చేస్తావా అని జగదీశ్ రాజ్ని నిలదీస్తాడు. ఎక్కడో ఏదో పోగపాటు జరిగింది కావాలని చేసింది కాదు అని రాజ్ సర్దిచెప్తాడు.

చాలా జాగ్రత్తగా ఇక్కడే పెట్టాము, టైట్ సెక్యూరిటీ పెట్టాను అంటాడు రాజ్ నిన్ను నమ్మి టెస్టింగ్ చేయకుండా ఇలా పట్టికెళ్లిపోతే ఏంటి అంటాడు జగదీశ్. వెంటనే కావ్య ఆ సీన్‌లోకి ఎంటర్ అవుతుంది. ఏమి జరుగుతంది ఇక్కడ అంటుంది. జరిగిన విషయం చెప్తే, ఇది నకిలీ కిరీటమే, డెమో కోసం పెట్టింది ఇక్కడ ఎందుకు పెట్టారు అసలైంది లాకర్‌లో ఉందని చెప్తుంది. అసలు కిరీటం తెచ్చి రాజ్ చేతులమీదుగా ఇప్పిస్తుంది. అది బంగారం అని తేల్చుకున్న తర్వాత జగదీశ్ రాజ్, కావ్య లకు క్షమాపనలు చెప్తాడు. ఇదంతా విన్న సెక్యూరిటీ గార్డ్ అనామికకు పంపిన కీరిటం నకిలీదని షాక్ అయ్యి, వెంటనే ఆమెకు ఫోన్ చేస్తాడు. జరిగినదంతా చెప్తాడు. దొంగతనం చేసిన నాకు, చేయించిన మీరు జైలుకు వెళ్తాము నిజం బయటపడ్డాక అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News