ఈరోజు ఎపిసోడ్‌లో సెక్యూరిటీ గార్డ్ అనామికకు ఫోన్ చేసి జరిగినదంతా చెప్తాడు. కావ్యకి తెలివే ఉంటే కిరీటం నా దగ్గర ఎందుకు ఉంటుంది అంటే మీ దగ్గర ఉంది బంగారం కాదు ఇనపది అంటాడు అసలైన కిరీటం ఇక్కడే ఉంది అంటాడు. అనామిక షాక్‌లో ఉండగా అప్పుడే కావ్య సెక్యూరిటీ గార్డ్ ఫోన్ తీసుకుని అనామికకు,సెక్యూరిటీ గార్డ్‌కి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు అనామికను సామంత్ నీ వల్ల ఏమి కాదు, ఇప్పటికైనా ఆ కంపెనీ పరువు తీసే ఆలోచన మానుకో అంటాడు. నువ్వు ఎందుకు పనికిరావు అని తెలుసుకో అంటాడు. ఆ మాటకి అనామిక సామంత్ చొక్కా గట్టిగా పట్టుకుని ఏం అన్నావు అని అరుస్తుంది. నేను కుడా నీ గొంతు పట్టుకోగలను చచ్చే దాక విడిపించుకోలేవు. కావ్య గురించి తక్కువ అంచనా వేసి టైం వేస్ట్ చేశాను తప్పు నాది ఉంది కాబట్టి నిన్ను ఏమి చేయట్లేదు అంటాడు.
రాజ్, జగదీశ్‌తో మీటింగ్ అయిపోయాక కావ్య దగ్గరికి వచ్చి తను చేసిన పనికి మెచ్చుకుంటాడు. అలా మాట్లాడుకుని వెళ్దామా అని కావ్య అడిగితే ఎక్కడికి అని రాజ్ అడుగుతాడు అప్పుడు బూత్ బంగ్లాకి అని అంటుది. రాజ్ ఏయ్ అంటే సర్లే అండి ఇంటికి వెళ్దాం అని వెళ్తారు. అక్కడ ఇంట్లో ధాన్యలక్ష్మి మేనమామ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన చుట్టం ప్రకాశం మా దగ్గర ఉన్న పాత బంగారం కావాలని అని అడిగాడు. అది కుడా రెండేళ్ల క్రితం ఉన్న రేటుకే ఇస్తాను అని చెప్తాడు అది విన్న అందరూ సంతోషపడతారు. వేరే ఆఫర్ ఉన్నా మీరు అడిగారని ఇస్తున్నా అంటాడు.
ఇంతలోనే కావ్య, రాజ్ ఇంటికి వస్తారు. ప్రకాశం అంతా చెప్తాడు, రాజ్ ఏమి మాట్లాడకపోతే కావ్య ఇప్లటే మనకి అంత గోల్డ్ అవసరం లేదు ముందే కొనేసి పెట్టుకున్నాము అంటుంది. ఆ మాటకు ధాన్యలక్ష్మి మా మావయ్యను అవమానిస్తునావా అని అంటుంది. ప్రకాశం కుడా ఒప్పించడానికి ట్రై చేస్తాడు. వెంటనే వచ్చిన మావయ్య నీ మాటకి ఎదురు చెప్పరు అని చెప్పావు.ఇదే నా నీ మాటకి ఉన్న విలువ నీ వల్ల నాకు ఎంత నష్టమో తెలుసా అని తిట్టి వెళ్లిపోతాడు.
కావ్య రాజ్ గదిలోకి వెళ్లిపోతుంటే ధాన్యలక్ష్మి వాళ్లని ఆపి రాకరాక మా పుట్టింటి వాళ్ళు వస్తే వాళ్ల ముందు మా పరువు తీసారు అంటుంది. ప్రకాశం కుడా రాజ్‌ని నిలదీస్తాడు, నిన్న గాక మొన్న వచ్చిన కావ్యకు ఏమి తెలుస్తుంది కంపెనీకి సంబంధించిన నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి అంటారు. మధ్యలో రుద్రాణి అగ్నిలో ఆజ్యం పోసినట్టు అందరినీ రెచ్చగోడుతుంది. కావ్య అటు కంపెనీలోనూ ఇంట్లోనూ నేను చెప్పిందే జరుగుతుంది సంబంధం లేని వాళ్లు జోక్యం చేసుకుంటే ఊరుకోను అంటుంది. ఆ మాటలకూ ప్రకాశం బాగా ఫీల్ అవుతాడు. రాత్రి సుభాష్ దగ్గరకు వెళ్లి మొదటి సారి అవమానం ఎలా ఉంటుందో రుచి చూశాను ఎలా నిద్ర పడుతుంది అంటాడు. తన అన్నయ్య దగ్గర ధాన్యలక్ష్మి ఎంత చెప్పినా దానికి బుద్ధి చెప్పానే కాని నేను నమ్మలేదు. నీ మాటకి ఏనాడు ఎదురు చెప్పలేదు. ఈరోజు నా పరువు అంతా పోయింది నేను చేసినా దాంట్లో ఏమైన తప్పు ఉందా అని అడుగుతాడు. కావ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు తెలియట్లేదు సుభాష్ చెప్తాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.