Monday, March 17, 2025
Homeచిత్ర ప్రభAng Lee : మరో బ్రూస్లీ బయోపిక్ త్వరలో.. ఆస్కార్ డైరెక్టర్ దర్శకత్వంలో..

Ang Lee : మరో బ్రూస్లీ బయోపిక్ త్వరలో.. ఆస్కార్ డైరెక్టర్ దర్శకత్వంలో..

- Advertisement -

Bruce lee : బ్రూస్లీ అంటే తెలియని వాళ్ళెవరూ ఉండరూ. కేవలం 32 ఏళ్లే బతికినా ప్రపంచం మొత్తం ఎప్పటికి గుర్తుండిపోయే సినిమాలు చేశాడు. అందుకే బ్రూస్లీ చనిపోయి 50 ఏళ్ళు అవ్వొస్తున్నా ఇంకా అందరికి గుర్తున్నాడు. చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ని ప్రపంచానికి పరిచయం చేసిన హాంగ్ కాంగ్, హాలీవుడ్ నటుడు బ్రూస్లీ.

ఇప్పటికే బ్రూస్లీ జీవితంపై పలు పుస్తకాలు, పలు సినిమాలు రాగా తాజాగా మరో బయోపిక్ ని ప్రకటించారు. లైఫ్ అఫ్ పై, హల్క్ లాంటి పలు హాలీవుడ్ సినిమాలు తెరకెక్కించి ఆస్కార్ అవార్డులు పొందిన దర్శకుడు ఆంగ్ లీ బ్రూస్లీ జీవిత కథపై సినిమాని తీయబోతున్నట్టు ప్రకటించాడు. ఇందులో ఆంగ్ లీ తనయుడు, నటుడు మాసన్ లీ బ్రూస్లీ పాత్రని పోషించబోతున్నట్లు తెలిపాడు.

సోనీ మరియు 3000 పిక్చర్స్ సంస్థలు ఈ బయోపిక్ ని నిర్మిస్తుండగా బ్రూస్లీ కూతురు షానన్ లీ కూడా నిర్మాతగా వ్యవహరించనుంది. త్వరలోనే ఈ సినిమా వర్క్ మొదలుపెడతానని తెలిపాడు ఆంగ్ లీ. ఈ సినిమా గురించి ప్రకటిస్తూ.. ప్రపంచానికి తెలియాల్సిన కథ బ్రూస్లీ. అతని జీవితంలోని విజయాలు, కష్టాలు అందరికి తెలియాలి. ఇది నా డ్రీం ప్రాజెక్టు కూడా అని తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రూస్లీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News