Saturday, January 11, 2025
Homeచిత్ర ప్రభBujji Thalli Song: 'బుజ్జి తల్లి' వీడియో సాంగ్‌ రిలీజ్

Bujji Thalli Song: ‘బుజ్జి తల్లి’ వీడియో సాంగ్‌ రిలీజ్

యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya), హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా ‘తండేల్‌’ (Thandel). వాస్తవ సంఘటనల ఆధారంగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ క్రమంలో ‘బుజ్జి తల్లి’ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

- Advertisement -

ఇప్పటికే విడుదలైన ‘బుజ్జి తల్లి’ (Bujji Thalli) లిరికల్ సాంగ్‌ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఎంతోమంది సంగీత ప్రేమికుల మనసు దోచేసింది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని ప్రముఖ గాయకుడు జావేద్‌ అలీ ఆలపించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందించగా..ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. కాగా శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News