Buchi Babu: బుచ్చిబాబు సనా.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు ఫుల్ క్రేజ్ ఉంది. తొలి చిత్రంతోనే ఇండస్ట్రీకి 100 కోట్ల సినిమా అందించాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఉప్పెనతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. చేసింది ఒక్క సినిమానే. అది కూడా కొత్త నటినటులు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ పరిచయం చేస్తూ ఉప్పెన తెరకెక్కించాడు. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసుని షేక్ చేసింది. భారీ వసూళ్లతో వందకోట్ల క్లబ్ లో చేరింది. ఉప్పెన బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ లో బుచ్చిబాబు పేరు మారుమ్రోగింది. ఎంతలా అంటే డెబ్యూ మూవీ తర్వాత ఆ వెంటనే గ్లోబల్ స్టార్ సినిమా చేసే స్థాయిలో ఆయన పేరు వినిపించింది.
రెండో సినిమానే గ్లోబల్ స్టార్ తో
రెండో సినిమాకే ఏకంగా రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ కన్ఫాం చేసుకున్నాడు.. ఇప్పుడు అదే సినిమా కోసం యావత్ భారత్ సినీ పరిశ్రమ మొత్తం చూస్తుండటం బుచ్చిబాబు సక్సెస్ కి నిదర్శనం. ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది మూవీ చేస్తున్నాడు. ఒకటి రెండు రోజుల్లో పెద్ది షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ప్రమోషన్స్ మిగిలి ఉన్నాయి. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని రిలీజ్ అంటే మూవీ టీంపై ఉండే ప్రెజర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ వైపు పెద్ది రిలీజ్ కోసం కష్టపడుతూనే.. మరోవైపు తన తదుపరి ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడట బుచ్చిబాబు. నిజానికి బుచ్చిబాబు నెక్ట్స్ మూవీపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.
మహేష్ తో ప్లాన్?
ఆయన తదుపరి సినిమా ఏంటి? ఏ హీరోతో చేయబోతున్నాడనేది ఇటూ ఫ్యాన్స్ లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బుచ్చిబాబు నెక్ట్స్ సినిమాకి సంబంధించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ లేటెస్ట్ బజ్ ప్రకారం.. బుచ్చిబాబు తన నెక్స్ట్ మూవీని మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నాడట. ఈ మేరకు చర్చలు కూడా జరుపుతున్నట్టు ఇన్ సైడ్ సినీ సర్కిల్లో టాక్. ఇప్పటికే మహేష్ కోసం ఓ పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశాడట. ప్రస్తుతం మహేష్ రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు వస్తుందనేది చెప్పలేం. అయినా.. తన నెక్ట్స్ సినిమాని మహేష్ చేయాలని బుచ్చి ఫిక్స్ అయ్యాడట. ఒకవేళ అంత ఓకే అయితే.. వారణాసి షూటింగ్ పూర్తయ్యేలోపు ఈ స్క్రిప్ట్ డెవలప్ చేయాలని అనుకుంటున్నాడట. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read: Ravi Babu: ఇప్పుటి వాళ్లంత ఒళ్లు బ**సి సినిమాలు చేస్తున్నారు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు

