Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభRGV Siri Stazie Interview: 100 ఏళ్ల క్రితమైతే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు!

RGV Siri Stazie Interview: 100 ఏళ్ల క్రితమైతే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు!

- Advertisement -

RGV Ashu Reddy Interview: డేంజరస్ మా ఇష్టం సినిమాని తెరకెక్కించిన వర్మ ఆ సినిమాను ప్రమోట్ చేసుకొనేందుకు తనదైన స్టైల్ లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టాడు. అందులో భాగంగానే హాట్ బ్యూటీ అషుకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. డేంజరస్ సినిమా కన్నా ఈ ఇంటర్వ్యూనే డేంజరస్ కావాలని అషు, ఆర్జీవీ ఫిక్స్ అయి ఈ ఇంటర్వ్యూ తెచ్చినట్లున్నారు. ఇందులో ఆర్జీవీ అషు కాళ్ళ దగ్గర కూర్చొని.. కాళ్ళకి ముద్దులు పెట్టడం, కాళ్ళని నాలుకతో టచ్ చేయడం.. ఇలా చేయాల్సిన అన్ని అరాచకాలు చేశారు.

డబుల్ డేంజరస్ అని పేరు పెట్టేసిన ఈ ఇంటర్వూలో అషు మాటలతోనే రెచ్చగొడుతుంటే.. ఆర్జీవీ మందు తాగుతూ అషు అందాన్ని కళ్ళతోనే జుర్రేసుకున్నాడు. అషు హుక్కా తాగుతూ టెంప్ట్ చేస్తుంటే.. ఆర్జీవీ డబుల్ మీనింగ్ మాటలతోనే తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. ఈ డేంజరస్ సినిమా సంగతెలా ఉన్నా ఈ ఇంటర్వ్యూ మాత్రం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారి గత వారం రోజులుగా దీని గురించే మాట్లాడుకొనేలా చేసింది.

వర్మ ఎంత పిచ్చోడిలాగా కనిపిస్తాడో.. అంతే ఫిలాసఫీ కూడా చెప్తారు. అందుకే ఆయనకి శిష్యగణం తక్కువగా లేదు. అందులో స్టార్ డైరెక్టర్ల దగ్గర నుండి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో లైఫ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. వీళ్ళలో కొందరు ఈ మధ్య ఇంటర్వ్యూలలో వర్మ చండాలం నచ్చలేదని చెప్తుంటే.. మరికొందరు దటీజ్ వర్మ అని ఇంకా వెనకేసుకొస్తూనే ఉన్నారు. అషుతో ఇంటర్వ్యూపై వచ్చిన రెస్పాన్స్ తర్వాత అలా ఎందుకు చేశానో అంటూ వర్మ మరో వీడియో రిలీజ్ చేశాడు.

అదలా ఉంటే సిరి స్టేజీ అనే మరో అమ్మాయితో కూడా వర్మ మరో ఇంటర్వ్యూ చేశాడు. మొన్నటిదాకా ఎవ్వరికీ తెలియని ఈ యంగ్ లేడీ ఇప్పుడు అందరి నోళ్ళలో నానడమే కాదు.. తన థైస్ గ్లామర్ పిక్చర్ మైండ్ లో జొప్పించేసింది. ఈ ఇంటర్వ్యూలో కెమెరా యాంగిల్స్ మొత్తం కూడా సిరి స్టేజీ థైస్ మీదనే పెట్టేసిన వర్మ.. ఆమె ఎదుటే కూర్చొని కొంటెగా చూస్తూ ఓపెన్ గా మాట్లాడారు. నువ్వు డేరింగ్ లేడీ అంటూ సోప్ వేస్తూనే ఆమెను ఫిమేల్ ఆర్జీవీగా ప్రమోట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

దీనిపై తాజాగా స్పందించిన రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి మాత్రం తిట్టాడో పొగిడాడో అర్ధం కాకుండా ట్వీట్ చేశారు. ఇదే ఇంటర్వ్యూ వందేళ్ల క్రితం తీస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు.. యాభై ఏళ్ల క్రితం వస్తే వెలి వేసేవారు. సమాజం బరితెగించడం వల్ల మీరు బతికిపోయారు అంటూ కామెంట్ పెట్టి వర్మని ట్యాగ్ చేశాడు బివిఎస్ రవి. దీంతో రవి వర్మని తిట్టాడా లేక పొగిడాడా అంటూ నెటిజన్లు చర్చ పెట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News