Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభC Kalyan : ఆ బడా నిర్మాతలు టాలీవుడ్ కి ఏమి చేయలేదు.. సి. కళ్యాణ్...

C Kalyan : ఆ బడా నిర్మాతలు టాలీవుడ్ కి ఏమి చేయలేదు.. సి. కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

- Advertisement -

C Kalyan : ఇటీవల కరోనా సమయంలో, ఆ తర్వాత కొన్ని రోజులు టాలీవుడ్ కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఏపీ ప్రభుత్వం మరిన్ని కష్టాలు పెట్టింది టాలీవుడ్ కి. ఆ సమయంలో పలువురు సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని కలిసి టికెట్ రేట్లు, షూటింగ్ విషయాల గురించి మాట్లాడారు. ఇక సినీ పరిశ్రమలో ఇబ్బందులని, అధిక ఖర్చులని తొలగించడానికి కొన్ని రోజులు షూటింగ్స్ బంద్ చేసి చర్చలు జరిపారు. వీటిపై తాజాగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. టాలీవుడ్ పెద్దలంతా కలిసి ఏపీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం. వాళ్ళ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి, వాళ్ళ షూటింగ్స్ కి పర్మిషన్స్ తెచ్చుకోవడానికి అంతేకాని టాలీవుడ్ కి, ఇక్కడి కార్మికులకు న్యాయం చేయడానికి కాదు. ఆ బడా నిర్మాతలు టాలీవుడ్ కి ఏమి చేయలేదు. వాళ్ళ కోసమే చేసుకున్నారు అని అన్నారు.

ఇక షూటింగ్స్ బంద్ పై మాట్లాడుతూ.. అసలు షూటింగ్ బంద్ అనేది అట్టర్ ఫ్లాప్ కాన్సెప్ట్. దానివల్ల ఎవరికీ, ఏమి ఒరగలేదు. ఎందుకు బంద్ చేశారో వాళ్లకి కూడా క్లారిటీ లేదు అని అన్నారు. దీంతో సి. కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News