Pawan Kalyan Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న మొదటి చిత్రం ఇదే కావడంతో, ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న హరిహర వీరమల్లుపై ట్రైలర్ విడుదలైన తర్వాత మరింత బజ్ పెరిగింది. తాజాగా సినిమా సెన్సార్ కూడా పూర్తైంది. యుఎ సర్టిఫికేట్ వచ్చింది. 2 గంటల 42 నిమిషాల రన్ టైమ్ వచ్చింది. ఇప్పుడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఫస్ట్ కాపీని సిద్ధం చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
రీసెంట్‌గా హరిహర వీరమల్లు సినిమా చూసిన సెన్సార్ టీమ్ అప్రిషియేట్ చేసినప్పటికీ బోర్డు సభ్యులు కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలిపారు. దీనితో ‘హరి హర వీరమల్లు’కు భారీ కట్స్ విధించారు. సెన్సార్ బోర్డు సూచనల మేరకు మూవీ టీం సుమారు 24 సెకన్ల సినిమాని కట్ చేసి, అదనంగా 34 సెకన్లు యాడ్ చేశారని సమాచారం. ఇందులో 5 సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ మెంబర్స్ చిత్ర యూనిట్‌ను ఆదేశించింది. అయితే ఈ కట్స్‌లో అభిమానులకు, పవన్‌కు షాకిచ్చిన అంశం ఏంటంటే, ట్రైలర్‌కు ప్రధాన బలంగా ఉన్న అర్జున్ దాస్ వాయిస్‌కు కూడా కత్తెర వేశారట. పవన్ స్వయంగా కోరుకుని అర్జున్ దాస్‌తో వాయిస్ ఓవర్ ఇప్పించుకున్నప్పటికీ, మొత్తం అతని వాయిస్‌లో 10 సెకన్ల కట్ విధించిందట బోర్డు. ఇది అభిమానులకు, పవన్‌కు షాక్ అనే చెప్పాలి. దీనితో పాటు, గర్భిణీ స్త్రీ విజువల్‌ను తగ్గించాలని సూచించినట్లు, అలాగే టెంపుల్ డోర్ ను తన్నే సన్నివేశాన్ని తొలగించాలని కూడా బోర్డు సభ్యులు మూవీ టీంను ఆదేశించినట్లు సమాచారం.
Also Read- Ghaati: అనుష్క ‘ఘాటి’ కొత్త రిలీజ్ డేట్.. ఈ సారైనా క్రిష్ మాట నిలబెట్టుకుంటాడా!
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం ఆయన తప్పుకోవటంతో దర్శకత్వ బాధ్యతలను జ్యోతికృష్ణ చేపట్టారు. సినిమాలో ఎక్కువ భాగం చిత్రీకరణంతా జ్యోతికృష్ణనే చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఏమ్ రత్నం ఈ సినిమాను నిర్మించారు. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా తొలి భాగాన్ని ‘హరి హర వీరమల్లు: కత్తి వర్సెస్ స్వార్డ్’ టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు మరో వారం రోజుల మాత్రమే సమయం ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతోంది.


