Tuesday, October 8, 2024
Homeచిత్ర ప్రభChagalamarri: చాగలమర్రిలో 'మా ఊరి సిన్మా' టీమ్ సందడి

Chagalamarri: చాగలమర్రిలో ‘మా ఊరి సిన్మా’ టీమ్ సందడి

ఆహ్వానించిన అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్

నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో ‘మా ఊరి సిన్మా’ చిత్రం ఈ నెల 12వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ‘మా ఊరి సిన్మా’ టీమ్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు పిలుపు మేరకు పులివెందుల నుంచి చాగలమర్రి గ్రామంలోని స్థానిక చైతన్య భారతీ పాఠశాల వేదిక చేసుకొని అక్కడ మా ఊరి సిన్మా టీమ్ హీరో పులివెందుల మహేష్ , హరి , కలిసి చాగలమర్రి వాసులతో ప్రమోషన్స్ బాగంగా సందడి చేశారు.

- Advertisement -

ఈ చిత్రంలోని ఆర్టిస్టులు చాగలమర్రి మండలం గొట్లురు గ్రామం నుంచి రమేష్ ఆనే ఆర్టిస్ట్ ఈ చిత్రంలో విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నట్టు తెలిపారు. హీరో పులివెందుల మహేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్ట పడి ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. ట్యాలెంట్ ఎవడి సొత్తు కాదని నిరూపించారు ఈ సినిమా టీం. ట్యాలెంట్ ఉంటే మనం ఎక్కడైనా బ్రతికేయచ్చని తెలిపారు. ఊర్లో ప్రతి ఒక్కరూ ఎందుకురా నీకు ఇవి అని అంటున్నారని మనం పట్టించుకోవద్దు మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలని ఆయన కోరారు.

మహేష్ ఫ్రెండ్ పులివెందుల హరి మాట్లాడుతూ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డామన్నారు. మేము చిన్నగా యూట్యూబ్ లో కామెడీ వీడియోలు తీసుకుంటూ అలాగే కామెడీ రీల్స్ చేస్తూ ప్రతి ఒక్కరి మన్ననలను పొందామని తెలిపారు. చైతన్య భారతీ పాఠశాల వేదికపై మాట్లాడుతూ సినిమా ప్రామోషన్స్ కోసం చైతన్య భారతీ పాఠశాల వేదిక చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గాంధీ జయంతి సందర్భంగా చైతన్య భారతి పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జున రావు ఆధ్వర్యములో హీరో పులివెందుల మహేష్ , హరి కలిసి గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళుర్పించారు. పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జున రావు , వల్లంకొండు సాయి సుదర్శన్ రావు కలిసి హీరో పులివెందుల మహేష్ , హరిలకు శాలువా కప్పి పూల మాల వేసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ప్రతి ఒక్కరూ ఈ నెల 12వ తేదీ మా ఊరి సిన్మా చిత్రం చూసి, చూపించి మీ ప్రేమాభిమానాలు మేము పొందాలని మహేష్, హరి అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య భారతీ పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జున రావు, మా ఊరి సిన్మా హీరో పులివెందుల మహేష్, హరి, రమేష్, రాజు, వల్లంకొండు సాయి సుదర్శన్ రావు, నాసీర్ పఠాన్, దొడియం చిన్న సుబ్రమణ్యం, షేక్ అబ్దుల్లా, రవితేజ, వీరాంజనేయులు, ఫసక్ బాలాజీ, అబ్దుల్ మునాఫ్, చిన్నవంగలి మధుసుధన్ రెడ్డి, వీడియోగ్రాఫర్ గఫార్ బాబా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News