Chikiri Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సానా బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా ‘పెద్ది’. ఈ సినిమా నుంచి ఇటీవలే ఫస్ట్ సాంగ్ “చికిరి చికిరి” వచ్చి చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే, చికిరి సాంగ్ 100 మిలియన్ వ్యూస్‌తో సంచలనం సృష్ఠించి.. ఇంకా దూసుకెళుతోంది. ఇటీవల కాలంలో చికిరి సాంగ్ అంత పెద్ద హిట్టయిన సాంగ్ మరోటి లేదనే చెప్పాలి. అయితే, తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
చికిరి సాంగ్ చిత్రీకరించిన కొండ పైకి టీమ్ చేరుకోవడానికి ఎంత లేదన్నా 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చిందట. తాజాగా విడుదల చేసిన వీడియోలో చరణ్ కూడా తాళ్లు పట్టుకుని కొండ పైకి ఎక్కుతున్న విజువల్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక, ఈ మేకింగ్ వీడియోలో చరణ్, చిత్ర దర్శకుడు బుచ్చిబాబు మధ్య ఉన్న స్పెషల్ బాండింగ్ హైలైట్ అని చెప్పక తప్పదు. బుచ్చిబాబును.. చరణ్ ఎంతో ఆప్యాయంగా ‘తలా’ అని పిలవడం, ఇద్దరూ కలిసి జోక్స్ వేసుకోవడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
Also Read – Bigg Boss Sohel: అట్లుంటది సొహైల్ తోటి.. కథ వేరుంటదంతే
ముఖ్యంగా, చరణ్ ఎంట్రీ మూవీ చిరుత సినిమా రిలీజ్ టైమ్‌లో.. థియేటర్లో మీ సాంగ్స్ కోసం వెయిట్ చేశాం, ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్‌గా చేస్తున్నా’ అంటూ ఎమోషనల్ అవడం, దీనికి చరణ్ నవ్వడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ‘పెద్ది’ సినిమా కోసం టీమ్ అంతా ఎంత డెడికేషన్‌తో పని చేస్తుందో.. ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక, ఈ సినిమాను 2026, మార్చి 27న రిలీజ్ చేయనున్నారు.
Thank you for all the love for #ChikiriChikiri ❤️
100 MILLION+ VIEWS ❤🔥
This is just the beginning, much more to come from #Peddi.@BuchiBabuSana #JanhviKapoor@arrahman @vriddhicinemas pic.twitter.com/LwLztmN5zw
— Ram Charan (@AlwaysRamCharan) November 27, 2025
ఆరోజున ఒక ప్రత్యేకత ఉంది. మార్చి 27న చరణ్ పుట్టినరోజు. అందుకే, బుచ్చిబాబు చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది సినిమాను బహుమతిగా ఇవ్వనున్నాడు. ఇక ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్, చికిరి సాంగ్ భారీ అంచనాలను పెంచేశాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న చరణ్.. ఆ తర్వాత వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాతో మాత్రం ఊహించిన విజయం దక్కలేదు. అందుకే, పెద్ది తో మళ్ళీ పాన్ వరల్డ్ రేంజ్ హిట్ కొట్టాలని ఈ రీతిలో చరణ్ శ్రమిస్తున్నాడు.
Also Read – Bigg Boss Bharani: భరణి ఏజ్ తెలుసుకుని ఏం చేస్తారు?

