Coolie – Chikitu Song: సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) ఫ్యాన్స్‌కు ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. తలైవర్ రజినీ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. ఆగస్ట్ 14న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చికిటు..’ సాంగ్ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను షేక్ చేస్తోంది. సన్‌పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
కూలీ చిత్రానికి ‘చికిటు..’ పాట (Chikitu Song) విడుదల ఒక డైనమిక్ స్టార్ట్ ఇచ్చింది. ఈ పాట ప్రారంభంలో వినిపించే ‘హేయ్ సౌండ్ పెంచు.. మన దేవా లోపలికి వస్తున్నాడు’ అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తోనే సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ అయింది. ఇది కేవలం ఒక ఆడియో ట్రీట్ మాత్రమే కాదు, తలైవా ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘కూలీ’ వస్తోందని చెప్పడానికి ఇది ఒక సూచన. ఈ డైలాగ్ విన్నప్పుడు కలిగే గూస్ బంప్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/andhra-pradesh-government-permission-to-kannappa-ticket-hikes/
అనిరుధ్ రవిచందర్ తనదైన మార్క్ ఎనర్జిటిక్ వాయిస్‌తో ఆలపించిన ఈ ‘చికిటు..’ పాట, విడుదలైన క్షణాల్లోనే మ్యూజిక్ చార్టులలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. రజనీకాంత్ ట్రేడ్‌మార్క్ స్టైల్, ఆయన వేసిన హుక్ స్టెప్పులు అయితే సాంగ్ కి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఈ పాటను అనిరుద్‌తో కలిసి సీనియర్ నటుడు, దర్శకుడు టి.రాజేందర్ పాడటమే కాకుండా ప్రమోషనల్ సాంగ్‌లో స్టెప్పులు కూడా వేశాడు. ఇక ప్రతి స్టెప్పు, ప్రతి ఫ్రేమ్‌లోనూ తలైవా అరవీర భయంకరమైన స్వాగ్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఈ సాంగ్ దూసుకుపోతోంది, సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.
రజినీకాంత్ వంటి మాస్ హీరోకు లోకేష్ కనకరాజ్ వంటి డైరెక్టర్ తోడు కావటంతో సినిమాపై బజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. తెలుగు విషయానికి వస్తే ఇక్కడి రైట్స్ కోసం మన నిర్మాతలు పోటీ పడ్డారు. ముఖ్యంగా ఇందులో విలన్ పాత్రలో నటించిన నాగార్జున సైతం తెలుగు హక్కుల కోసం పోటీ పడ్డారు. అయితే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత సునీల్ నారంగ్ సినిమా తెలుగు హక్కులను దక్కించుకున్నారని సినీ వర్గాలంటున్నాయి. మరి రిలీజ్ తర్వా కూలీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.