Vishwambhara – OG: చిరంజీవి విశ్వంభర రిలీజ్ ఎప్పుడన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సింది. కానీ రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌కు దారి ఇచ్చిన చిరు వెనక్కి తగ్గారు. అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇంకా ఈ సినిమాలో మార్పులు, చేర్పుల పేరుతో డైరెక్టర్ వశిష్ట చెక్కుతూనే ఉన్నట్లు సమాచారం. టీజర్‌లోని గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రిలీజ్ వాయిదాపడటంతో ఆ తప్పులను సరిచేసుకునే అవకాశం మేకర్స్‌కు దొరికింది. మరోసారి ఫ్యాన్స్ నుంచి డిజప్పాయింట్ చేయకూడదనే ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం.
స్పెషల్ సాంగ్…
ప్రస్తుతం ఈ విఎఫ్ఎక్స్ పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. చివరి నిమిషంలో చిరు అభిమానుల కోసం ఓ స్పెషల్ సాంగ్‌ను యాడ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సాంగ్‌ను షూట్ చేయబోతున్నట్లు తెలిసింది.
వారం గ్యాప్‌లో…
కాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ కొత్త న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 18న విశ్వంభర సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాణ సంస్థ డిసైడ్ అయినట్లు చెబుతోన్నారు. ఇదే నెలలో సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ఓజీతో పాటు బాలకృష్ణ అఖండ 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటికి వారం రోజుల ముందు విశ్వంభర బాక్సాఫీస్ బరిలో నిలవబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇదే డేట్ ఫిక్సయితే వారం గ్యాప్‌లో అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌గా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే విశ్వంభర రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ముగ్గురు హీరోయిన్లు…
విశ్వంభర మూవీకి బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.