Friday, November 8, 2024
Homeచిత్ర ప్రభChiranjeevi: 'మెగా' క్లింకారా.. చెర్రీ-ఉప్పీల ముద్దుబిడ్డ

Chiranjeevi: ‘మెగా’ క్లింకారా.. చెర్రీ-ఉప్పీల ముద్దుబిడ్డ

లలితా సహస్రనామం నుంచి పేరు ఎంపిక

ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి మనువరాలు, రాం చరణ్-ఉపాసనల గారాల పట్టి పేరును చిరంజీవి ప్రకటించారు. క్లింకారా అన్న పేరు పెట్టినట్టు చిరు ప్రకటన చేశారు. లలితా సహస్రనామం నుంచి ఈ పేరును ఎంపిక చేసుకున్నట్టు చిరంజీవి వివరించారు. తమకు పుట్టబోయే బిడ్డల పేర్లను తామెప్పుడో నిర్ణయించుకున్నట్టు గతంలోనే చెర్రీ-ఉప్పీ వెల్లడించారు కూడా. ఉపాసనకు దైవ భక్తి చాలా ఎక్కువ. పలువురు గురూజీలు, ఆశ్రమాలు, మఠాలను తప్పకుండా విజిట్ చేసే ఉప్పీ ఇలా లలితా సహస్రనామం నుంచి తన బిడ్డకు క్లింకారా అని పేరు ఎంపిక చేసుకోవటం విశేషం. ఇటు చిరు, చెర్రీకి కూడా దైవ భక్తి అధికం. ఏటా క్రమం తప్పకుండా తండ్రీ-కొడుకులు అయ్యప్ప మాల వేసుకుంటారు కూడా.

- Advertisement -

ఉపాసన డెలివరీ డేట్-టైం వెల్లడించిన మీడియా అప్పటి నుంచీ ఒకటే సందడి చేస్తోంది. ఈమధ్యనే చెర్రీ సంతానం ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీకయ్యాయి. ఇవి మెగా ఫ్యాన్స్ గ్రూపుల్లో బాగా వైరల్ అయ్యాయి కూడా. వేణుస్వామి వంటి జ్యోతిష్యులు ఇప్పటికే మెగా గ్రాండ్ డాటర్ జాతకం కూడా చెప్పేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News