Homeచిత్ర ప్రభAnil Ravipudi: కొరియోగ్రాఫ‌ర్‌గా మారిన చిరంజీవి - సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన అనిల్ రావిపూడి

Anil Ravipudi: కొరియోగ్రాఫ‌ర్‌గా మారిన చిరంజీవి – సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన అనిల్ రావిపూడి

Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేస్తోంది. రెండు రోజుల్లోనే వ‌ర‌ల్డ్ వైడ్‌గా 120 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో అతి త‌క్కువ టైమ్‌లోనే వంద కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టిన సినిమాగా మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు నిలిచింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీకి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విక్ట‌రీ వెంక‌టేష్ గెస్ట్ రోల్‌లో న‌టించిన ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది.

- Advertisement -

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు థాంక్స్ మీట్‌ను గురువారం నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో ఓ ఇంట్రెస్టింగ్ సీక్రెట్‌ను బ‌య‌ట‌పెట్టారు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. ఈ సినిమా కోసం చిరంజీవి కొరియోగ్రాఫ‌ర్‌గా కూడా మారార‌ట‌. ఇందులోని మెగా విక్ట‌రీ సాంగ్‌లో చిరంజీవి, వెంక‌టేష్ ఇద్ద‌రు క‌లిసి క‌నిపించారు. ఈ పాట‌లో డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కూడా గెస్ట్‌గా త‌ళుక్కున మెరిశారు. చిరంజీవి, వెంక‌టేష్‌ల‌తో క‌లిసి స్టెప్పులు వేశారు. అనిల్ రావిపూడి వేసిన స్టెప్పుల‌కు చిరంజీవి స్వ‌యంగా కొరియోగ్ర‌ఫీ అందించార‌ట‌. థాంక్స్ మీట్‌లో అనిల్ రావిపూడి వెల్ల‌డించారు.

Also Read- Bhogi: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సంక్రాంతి సంబరాలు.. భోగి మంటలతో నెలకొన్న సందడి

“చిరంజీవి, వెంక‌టేష్ ఇద్ద‌రితో క‌లిసి డ్యాన్స్ చేయాల‌న్న‌ది తెలుగు సినిమా అభిమానిగా నా డ్రీమ్‌. కానీ ఈ విష‌యం చెబితే ఏమైనా అనుకుంటారా? డైరెక్ష‌న్ చేసుకోవ‌చ్చుగా అని అంటారేమో అని భ‌య‌ప‌డ్డా. మెగా విక్ట‌రీ సాంగ్ షూట్ చేస్తున్న టైమ్‌లో ఓ రోజు…. మేక‌ప్, క‌ళ్ల‌ద్దాలు, కోటు వేసుకొని వెళ్లా. న‌న్ను చూసి ఏంట‌బ్బాయి అని చిరంజీవి అడిగారు.. పాట‌లో నేను కూడా యాక్ట్ చేస్తున్నా అని అన‌గానే రెడీ అయిపోయావా అని అన్నారు. నా స్టెప్పుల‌కు మొత్తం కొరియోగ్ర‌ఫీ చిరంజీవి చేశారు. నేను ప‌ర్‌ఫెక్ట్ చేయ‌లేక‌పోయా. నా ముందు మూవ్‌మెంట్ ప‌ర్‌ఫెక్ట్‌గా లేక‌పోతే ఎలా అంటూ చిరంజీవి స్వ‌యంగా స్టెప్పులు వేయించారు. ఇద్ద‌రు హీరోలు బంగారం. థియేట‌ర్ల‌లో నా డ్యాన్స్ చూసి కూడా ఆడియెన్స్ చ‌ప్ప‌ట్లు కొడుతుంటే ఆనందంగా ఉంది” అంటూ అనిల్ రావిపూడి అన్నారు.

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారుమూవీని సాహు గార‌పాటితో క‌లిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మించారు. కేథ‌రిన్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Also Read- BMW Review: ‘భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి’ ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News