Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న తన సిబ్బంది ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. ఈ విషయం తెలిసి ఆయన ఫ్యాన్స్, నెటిజన్స్ చిరంజీవి మంచి మనసును కొనియాడుతున్నారు. కాగా చిరు సేవాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన పేరుపై బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమంది అవసరాలను తీరుస్తున్నారు. ఇక ఆపదలో ఉన్నవారిని ఆపన్న హస్తం ఇవ్వడంతో ఎప్పుడూ ఆయనదే పై చేయి.
మేకప్ ఆర్టిస్టుగా అండగా
తాజాగా కష్టాల్లో ఉన్న తన మేకప్ ఆర్టిస్టుగా అండగా నిలిచారు. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ హార్ట్ సర్జరీ కోసం రూ. 10.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. అలాగే తన మాజీ మేనేజర్ నరసయ్య సతీమణి బైపాస్ సర్జరీకి రూ. రూ.9.5 లక్షలు అందించి వారంలోనే రూ. 20 లక్షల ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు ఇద్దరికీ సర్జరీ ఏర్పాట్లు స్వయంగా ఆయనే చూసి ఆ కుటుంబాలకు అండగా నిలిచారు. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ఆయన ఉదారతను కొనియాడుతున్నారు.
ఇప్పటికే గద్దర్ అవార్డు ప్రధానోత్సవంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ అవార్డుతో పాటు పది లక్షల రూపాయల నగదును ఆయనకు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. అవార్డుతో వచ్చిన ఆ నగదును మొత్తాన్ని చిరు సామాజిక సేవకే ఉపయోగించారు. పలు సేవా సంస్థలకు ఈ డబ్బును ఆయన విరాళంగా అందజేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవల తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యుల హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రూ. 5లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇలా ఇండస్ట్రీకే కాదు సేవా గుణంలోనూ చిరంజీవి పెద్దన్న అనిపించుకుంటున్నారు.
Also Read: Disco Shanti: బావను మగధీర సినిమాలో నటించొద్దని చెప్పా.. శ్రీహరి భార్య షాకింగ్ కామెంట్స్

