మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర'(Vishwambhara) మూవీ కోసం మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది . ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుండి మరో కీలక అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని తెలిపారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శోభి మాస్టర్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని శంకర్ పల్లిలో ఓ అద్భుతమైన సెట్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం ప్రొడక్షన్ డిజైనర్ ఎఎస్ ప్రకాష్ అందమైన సెట్ రూపొందించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ పాట కోసం పవర్ ఫుల్ మాస్ అంథమ్ కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాట షూటింగ్ నుంచి విడుదలైన చిరు లుక్ వింటేజ్ చిరంజీవిని తలపిస్తోంది. స్లైలిష్ లుక్‌తో అదరగొట్టారు. కాగా డెబ్యు మూవీ ‘బింబిసార’తో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు వశిష్ట తన అభిమాన హీరో చిరంజీవితో కలిసి ‘విశ్వంభర’ను అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. మూవీ కోసం ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ UV క్రియేషన్స్ నిర్మిస్తోంది, ఇందులో ప్రముఖ తారాగణం, టాప్ క్లాస్ సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ నటిస్తుండగా, కునాల్ కపూర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
