మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తల్లి అంజనాదేవి(Anjana Devi) అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఆమె అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
- Advertisement -
మరోవైపు తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు అధికారులతో నిర్వహించాల్సిన సమీక్షలను రద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్లారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా అంజనాదేవి అనారోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల అంజనా దేవి పుట్టిన రోజును చిరంజీవి కుటుంబం ఘనంగా జరిపిన సంగతి తెలిసిందే.