Chiranjeevi Watched Peddi Glimpse: రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పెద్ది టీం ఫ్యాన్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. మూవీ టీజర్ గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఆడియన్స్, ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది ఈ చిత్రం. దీంతో ఇందులో రామ్ చరణ్ కుస్తీ పోటీలకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో చరణ్ పహిల్వాన్‌లా బీస్ట్ మోడ్‌లో కనిపించాడు.
పహిల్వాన్ లా చరణ్.. చిరు రియాక్షన్
వెనక్కి మడిచిన జుట్టు, తిరిగిన కండలు, గదతో దర్శనం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ గ్లింప్స్‌కి ఆడియన్స్, ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఈ గ్లింప్స్‌ని మెగాస్టార్ చిరంజీవి చూశారు. బుచ్చిబాబు సానా దగ్గరుండి చిరుకి గ్లింప్స్ చూశారు. ఇందులో చరణ్ లుక్ చూసిన ఆయన ఆనందంతో ఉప్పోంగిపోయారు. బుచ్చిబాబును కౌగిలించుకుని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియోని మేకర్స్ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘అనంతరం గ్లింప్స్ చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియోలో చరణ్ ను అద్భుతంగా చూపించారు’ అంటూ బుచ్చిబాబు పనితీరుపై ప్రశంసలు కురిపించారు.
ఆయన ప్రశంసించడంతో కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్న బుచ్చిబాబు చిరు దగ్గరి తీసుకుని కౌగిలించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో మెగా ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. కాగా మొదటి నుంచి చిరు పెద్ది సినిమా పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించిన విశేషాలను షేర్ చేసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన పెద్ది సెకండ్ సాంగ్ రై రై రారా పాటపై రివ్యూ ఇస్తూ.. ఇందులో చరణ్ నటనను ప్రశంసించారు.
పెరిగిన అంచనాలు
ఇక ఇప్పుడు పహిల్వాన్ గ్లింప్స్‌పై చిరు స్పందన చూసిన తర్వాత పెద్ద మూవీపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. మెగాస్టార్ మురిసిపోయారంటే పెద్ది బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాయడం పక్కా అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంతో తెరకెక్కితోన్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.
Also Read: Bellamkonda Srinivas: తిరుపతిలో సింపుల్‌గా బెల్లంకొండ హీరో పెళ్లి.. ఎప్పుడంటే!
MEGASTAR APPRECIATES PEDDI PEHELWAN 💥💥💥@KChiruTweets Garu watched the #PeddiPehelwanGlimpse and loved it ❤️
▶️ https://t.co/Pvcy3KBaYw#HBDRamCharan#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana… pic.twitter.com/MA7LpekgS1
— Vriddhi Cinemas (@vriddhicinemas) March 27, 2026

