Monday, December 9, 2024
Homeచిత్ర ప్రభChitrmrutham a music concert: ‘చిత్రామృతం’ మ్యూజిక్‌ కన్సర్ట్‌

Chitrmrutham a music concert: ‘చిత్రామృతం’ మ్యూజిక్‌ కన్సర్ట్‌

డిసెంబర్ 22న..

మధుర గాయని, మన తెలుగు వారికి ఫేవరెట్ సింగర్ చిత్ర బర్తే డే సందర్భంగా భారీ మ్యూజిక్ కాన్సర్ట్ జరుగనుంది.

- Advertisement -

ఎన్ ఛాంట్ మీడియా, ఎమ్3 ఎంటర్టైన్‌మెంట్‌ నిర్వహణలో 2024 డిసెంబర్ 22న శిల్పకళా వేదికలో ప్రముఖ గాయని కె ఎస్ చిత్ర… ‘చిత్రామృతం’ మ్యూజిక్‌ కన్సర్ట్‌ నిర్వహించనున్నారు. ప్రముఖ గాయని కేఎస్ చిత్రా 45 ఏళ్ల ప్రస్థానానికి స్మరణార్థంగా నిర్వహించనున్న ఈ చిత్రామృతం ప్రెస్ మీట్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లోని ఒక హోటల్‌లో జరిగింది. ఈ వేడుకలో కేఎస్ చిత్త్ర, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాల్గొని కన్సర్ట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఇందులో ఇండియన్ ఐడల్ తెలుగు నుండి రజిని, దృతి, రజిని పూర్ణిమ, కీర్తన, శ్రీకీర్తి, వల్లభ, కుశాల్, సాయి మాధవ్ లు చిత్త్ర గారి ప్రసిద్ధ పాటలను ఆలపిస్తూ హృదయపూర్వకమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనతో చిత్ర ఎంతో భావోద్వేగానికి గురై, వారిని ఆశీర్వదించి, ఈ స్మరణీయ ప్రదర్శన కోసం వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఆర్పీ పట్నాయక్, చిత్రతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకొని, ఆమె వినయం, వృత్తిపరమైన నిబద్ధత గురించి పేర్కొన్నారు, ఇది ఆమెతో పనిచేసిన ప్రతి ఒక్కరిపై చెరగని ముద్ర వేశాయన్నారు.

ఎన్ ఛాంట్ మీడియా మరియు ఎమ్3 ఎంటర్టైన్‌మెం చిత్రామృతం కచేరీ 2024 డిసెంబర్ 22న శిల్పకళా వేదికలో జరగనుంది, టికెట్లు ఇప్పటికీ బుక్ మై షో లో అందుబాటులో ఉన్నాయి. ఈ కచేరీ చిత్ర హిట్స్ ను ఎంజాయ్ చేయాలని ఆహ్వానిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News