Homeచిత్ర ప్రభVikram: విక్రమ్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. కొత్త సినిమా ప్రకటన, టీజర్‌ రిలీజ్‌

Vikram: విక్రమ్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. కొత్త సినిమా ప్రకటన, టీజర్‌ రిలీజ్‌

Vikram Birthday: కోలీవుడ్‌ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. పాత్రలతో ప్రయోగాలు చేసే నటుల్లో ఆయన ఒకరు. విభన్న పాత్రలు, కథలతో ఎప్పుడు ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ని కొత్త అనుభూతి అందిస్తుంటారు. చివరిగా ఆయన తంగలాన్‌ చిత్రంతో అలరించారు. ఈ సినిమా వచ్చి రెండేళ్లు అవుతుంది. కానీ, ఇప్పటి వరకు ఆయన నుంచి ఎలాంటి సినిమా ప్రకటన లేదు.  ఈ క్రమంలో రెండేళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన కొత్త సినిమాను ప్రకటించారు. సినిమా ఆయన కెరీర్‌లో 63వ చిత్రంగా నిలవనుంది.

- Advertisement -

ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్, టీజీ త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ ‍అప్‌డేట్‌ ఇచ్చారు. ఇవాళ చియాన్ విక్రమ్ బర్త్ డే కావడంతో ఫస్ట్‌ లుక్‌తో పాటు టీజర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫ్లేమ్ పేరుతో ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. ఇందులో విక్రమ్ లుక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్‌ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంతోశ్ నారాయణన్ సంగీతమందిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News