Homeచిత్ర ప్రభChiyaan Vikram: పదేళ్ల తర్వాత విడుదలకు సిద్ధమైన విక్రమ్ సినిమా

Chiyaan Vikram: పదేళ్ల తర్వాత విడుదలకు సిద్ధమైన విక్రమ్ సినిమా

Dhruva Natchathiram: కోలీవుడ్ స్టార్ విక్రమ్ సినిమాకు దాదాపు పదేళ్ల తర్వాత మోక్షం లభించింది. ఆర్థిక వివాదాలతో వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ రిలీజ్‌కు మార్గం సుగమమైంది. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ‘ధృవనక్షత్రం‘ రిలీజ్‌కు మద్రాస్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్‌ 15 లోపు విడుదల చేసుకునేలా వీలు కల్పించింది. కొండాడువోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరిట బ్యాంకు ఖాతాను తెరవాలని సూచించింది.

- Advertisement -

దీని ద్వారానే ఈ సినిమాకి సంబంధించిన లావాదేవీలు జరగాలని కోర్టు ఆదేశించింది. దీంతో 2016లో ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మొదట 2017లోనే విడుదల చేయాలని డైరెక్టర్‌ గౌతమ్‌ మేనన్‌ యత్నించారు. కానీ ఆర్థిక పరమైన చిక్కులతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఆ తర్వాత 2023లోనూ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. శింబు హీరోగా గౌతమ్‌ మీనన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రూ.2.40 కోట్లు తీసుకున్నారని ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ సంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది.

Also Read: RC 17: జూన్ లో చరణ్-సుకుమార్ మూవీ షూటింగ్ స్టార్ట్.. మైత్రీ చెర్రీ క్లారిటీ

ఆ డబ్బు తమకు తిరిగి ఇవ్వలేదని.. ఆయన ధృవ నక్షత్రం సినిమా విడుదలపై నిషేధం విధించాలని నిర్మాణ సంస్థ కోర్టును కోరింది. ఈ వివాదంతో ధృవనక్షత్రం మరోసారి వాయిదా వేయాల్సి ఉంది. ఆ తర్వాత కూడా 2024లో జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని చిత్ర బృందం మరోసారి సంకేతాలిచ్చింది. కానీ అప్పుడు కూడా ఆ విడుదల కాలేదు. అలా ఇ‍ప్పటికే పలుసార్లు పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఈ మూవీలో విక్రమ్‌, వినాయకన్, రీతూ వర్మ, పార్థిబన్, సిమ్రాన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News