Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చిన చాలా కాలం అవుతుంది. కానీ, ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి చేసుకోలేదు. అంతేకాదు ఈ మూవీ రిలీజ్ ఎప్పుడనేది కూడా క్లారిటీ లేదు. అసలు మూవీ షూటింగ్ జరుగుతుందా లేదా అనే క్లారిటీ లేదు. అప్పట్లో గ్లింప్స్, పోస్టర్స్‌తో హడావుడి చేసిన మూవీ టీం 2025లోనే సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత వాయిదా పడ్డ ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు.
నో అప్డేట్స్
కనీసం షూటింగ్ అప్‌డేట్ కానీ, మూవీ పోస్టర్స్, వీడియోలు లాంటి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదు. విశ్వంభర విషయంలో మూవీ టీం అంత సైలెంట్‌గానే ఉంది. ఇంకా చెప్పాలంటే విశ్వంభర తర్వాత మొదలు పెట్టిన మన శంకర వరప్రసాద్ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలై బ్లాక్‌బస్టర్ కూడా కొట్టింది. ఇక ఈ జోష్‌లో ఉన్న ఫ్యాన్స్ విశ్వంభర గురించి మర్చిపోయారనే చెప్పాలి. అయితే, చాలా కాలం తర్వాత ఈ సినిమా నుంచి ఓ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు. ఈ సినిమాకు ఆయన సినిమాటోగ్రాఫ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే నేడు జగపతి బాబు, లయలు ప్రధాన పాత్రలో నటిస్తున్న వదల మూవీ గ్లింప్స్ రిలీజైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చోటా కే నాయుడు విశ్వంభర మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంజి సినిమా కోసం మేం తలెత్తుకొని పనిచేశాం.. కానీ విశ్వంభర మాత్రం తలదించుకొని పనిచేస్తున్నామన్నాడు.
Also Read: Monalisa: ప్రియుడితో కలిసి పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా.. అసలేమైందంటే!
విశ్వంభరకు రూ.400 కోట్ల బడ్జెట్..
విశ్వంభర సినిమాకు సీజీ వర్క్ చాలా అద్భుతంగా ఉండబోతుందని, అక్కడికి వెళ్లి మన ఇగో చూపిస్తే వర్క్ అవుట్ కాదు అందుకే ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు పెట్టుకొని పనిచేస్తున్నామన్నాడు. ఈ సినిమా వెనుక రూ. 400 కోట్ల బడ్జెట్ ఉందని తెలిపాడు. ఇలా ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించడం వల్ల సరైన అవుట్ ఫుట్ కోసమే ఆలస్యం అవుతుందని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం మూవీకి సంబంధించిన సీజీ వర్క్ జరుగుతోందని చెప్పాడు.
ఇగోకి పోవట్లేదు..
సినిమాల్లో సిజీ వర్క్ ఉన్నప్పుడు కెమెరామెన్ ఎవరైనా కానీ, వీఎఫ్ఎక్స్ టెక్నీషియన్లు చాలా ముఖ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘వాళ్ళు ఎంత బాగా ప్లాన్ చేసుకుంటే అవుట్‌పుట్ అంత అద్భుతంగా వస్తుంది. అందుకే ఆ సక్సెస్ ఫెయిల్యూర్‌తో కెమెరామెన్‌కు పెద్దగా సంబంధం ఉండదు. సీజీ టీమ్ ఏం అడిగితే అది ఇవ్వడమే మా బాధ్యత’ అని వివరించారు. ఒక్కోసారి సీజీ టీమ్ అడిగిన లైటింగ్ రాంగ్ అని తమకు ముందే తెలిసినా బెస్ట్ ఔట్‌పుట్ కోసం వాళ్లు అడిగిందే ఇస్తామని చెప్పారు. ఇగోకి పోయి వాళ్ళకు కోఆపరేట్ చేయకపోతే రేపు ప్రాజెక్ట్ పాడవుతుందని, అందుకే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సీనియారిటీని పక్కనపెట్టి పనిచేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు సిజీ కోసం మొదటి నుంచి చివరి దాకా ఒక స్పెషల్ టెక్నీషియన్ సెట్‌లో ఉంటున్నారని వాళ్లకి తెలియకుండా ఒక్క ఫ్రేమ్ కూడా తీయట్లేదని ఆయన చెప్పుకొచ్చాడు.

