Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభCitadel India: వరుస షూటింగులతో సమంత బిజీ, సిటడల్ తరువాత ఖుషీ షెడ్యూల్స్

Citadel India: వరుస షూటింగులతో సమంత బిజీ, సిటడల్ తరువాత ఖుషీ షెడ్యూల్స్

అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న సిటడల్ సిరీస్ నుంచి సూపర్ స్టార్ సమంత వైదొలగలేదన్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు నిర్మాతలు. సామ్ తో కలిసి నటిస్తుండటం చాలా మంచి అనుభూతి అంటూ సహ నటుడు, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజ్ అండ్ డీకే డైరక్షన్ లో వస్తున్న సిటడల్ ప్రస్తుతం ముంబైలో తెరకెక్కుతోంది. నెక్ట్స్ షెడ్యూల్స్ అన్నీ నార్త్ ఇండియాలోని డిఫరెంట్ లొకేషన్స్, ఇంటర్నేషనల్ స్పాట్స్ అయిన సెర్బియా, సౌత్ ఆఫ్రికాలో సాగనున్నాయి.

- Advertisement -

వరుణ్ ధావన్ తో కలిసి సిటడల్ ఇండియాలో యాక్ట్ చేస్తున్న సమంత బిజీగా షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఈ సిరీస్ లో ఆమె బ్రాండ్ న్యూ అవతార్ లో కనిపిస్తారని రాజ్, డీకే చెబుతున్నారు.

ఆటో ఇమ్యూన్ కండిషన్ మయోసైటిస్ బారిన పడ్డ సామ్ కాస్త తేరుకుని, పనిలోనే ప్రశాంతతను వెతుక్కుంటున్నారు. సిటడెల్ ఫస్ట్ షెడ్యూల్ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ఖుషీ సినిమా షూటింగ్ లో ఆమె పాల్గొంటారు.

‘సిటడల్’ తెలుగు సిరీస్ లో సమంత ఫస్ట్ లుక్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad