Trisha vs Nayanthara: కోలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోయిన్స్.. త్రిష (Trisha), నయనతార (Nayanthara) విషయానికి వస్తే ఎవరి రేంజ్ వారికుంది. అయితే కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడది మరోసారి డిస్కషన్ పాయింట్‌గా మారింది. వీళ్లిద్దరూ దశాబ్దాలుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న టాప్ హీరోయిన్స్. ఎవరికి వారు తమ నటనతో ఆడియన్స్ మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. చాలా ఏళ్లయినా కూడా అదే స్టార్ స్టేటస్‌ని మెయింటైన్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే వీళ్ల మధ్య మొదటి నుంచి ఏదో గ్యాప్ ఉందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నిజానికి, వీళ్ల కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచీ ఇప్పటి వరకూ సఖ్యత కుదరట్లేదని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. అసలు ఇద్దరి మధ్య ఈ వార్ అసలు ఎక్కడ మొదలైంది? ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉంది? అనే దానిపై ఓ లుక్కేద్దాం..
Also Read- Anushka vs Rashmika: రష్మిక వర్సెస్ అనుష్క – టాలీవుడ్ టాప్ హీరోయిన్ల బాక్సాఫీస్ వార్
నయనతార, త్రిష మధ్య కోల్డ్ వార్‌కి మెయిన్ రీజన్ 2008లో వచ్చిన ‘కురువి’ సినిమానే అని చాలా మంది చెబుతారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాలో నయనతార చేయాల్సిన క్యారెక్టర్‌ని త్రిష చేసిందట! అక్కడే వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ కి బీజం పడిందని అంటుంటారు. అప్పటి నుంచి మొదలైన ఈ వార్ ఇప్పటికీ ఆగడం లేదు. దీనికి తోడు, స్క్రిప్ట్ మారిన సినిమాలు కూడా ఈ కోల్డ్ వార్‌ని పెంచాయి. ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన ‘మూకుత్తి అమ్మన్’ సినిమాను త్రిష వదులుకుంది. ఆ ఛాన్స్‌ని నయనతార గ్రాబ్ చేసుకుని, ఏకంగా సూపర్ హిట్ కొట్టేసింది! ఇది నిజంగా త్రిషకు ఊహించని షాక్. అయితే, ఆ తర్వాత కమల్ హాసన్ (Kamal Haasan), మణిరత్నం కాంబోలో వచ్చిన ‘థగ్ లైఫ్’ (Thug Life) మూవీలో త్రిష నటించిన రోల్ కోసం మేకర్స్ ముందుగా నయనతారను సంప్రదిస్తే ఆమె రిజెక్ట్ చేసింది. దీంతో త్రిష లైన్ లోకి వచ్చిందట. అయితే త్రిష లెక్క తప్పింది ‘థగ్ లైఫ్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది.
ఇప్పటి వరకూ స్క్రిప్ట్ విషయంలో సినిమాలు చేతులు మారడం చూశాం. కానీ ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో కూడా వీళ్ల మధ్య కోల్డ్ వార్ పీక్స్ కి చేరింది! లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. ‘అడివెల్లి’ (Adi Velli) సినిమా రీమేక్ కోసం మేకర్స్ ముందుగా నయనతారని సంప్రదించారు. అయితే నయనతార ఏకంగా రూ.15 కోట్లు డిమాండ్ చేసిందట! దీంతో నిర్మాతలు నయనతారని పక్కన పెట్టి, త్రిషతో చర్చలు స్టార్ట్ చేశారని సమాచారం. మరి ఈ సినిమా ఫైనల్‌గా ఎవరితో ముందుకు వెళ్తుందో తెలియదు కానీ, రెమ్యూనరేషన్ వార్ ఇప్పుడు కొత్త హాట్ టాపిక్ అయింది. జనరల్‌గా ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య సఖ్యత బాగుంటుంది కానీ, ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగడం మాత్రం ఫ్యాన్స్‌కి షాక్ ఇస్తోంది.
Also Read- Tollywood: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల జాతర.. ఒక్క రోజే ఎనిమిది సినిమాలు రిలీజ్

