తెలంగాణ మంత్రి సీతక్క(Seethakka)తో ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ(Ali) సమావేశం అయ్యారు. సచివాలయంలోని మంత్రి పేషీలో డైరెక్టర్ రమణారెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తాను చిత్రీకరించిన ‘నిన్ను నన్ను కన్నది ఆడది రా’ అనే పాట ఆవిష్కరణకు సీతక్కను ముఖ్య అతిథిగా అలీ ఆహ్వానించారు. సామాజిక బాధ్యతగా ఇలాంటి పాట రూపొందించిన అలీని శాలువాతో సీతక్క సత్కరించి అభినందనలు తెలియజేశారు. కాగా ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ నెల 8వ తేదీ సాయంత్రం పాట ఆవిష్కరణ ఉంటుందని అలీ పేర్కొన్నారు.
Seethakka: మంత్రి సీతక్కతో కమెడియన్ అలీ భేటీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES