Wednesday, April 16, 2025
Homeచిత్ర ప్రభSapthagiri: క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి ఇంట్లో తీవ్ర విషాదం

Sapthagiri: క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి ఇంట్లో తీవ్ర విషాదం

టాలీవుడ్ క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి(Sapthagiri) ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న త‌ల్లి చిట్టెమ్మ మంగళవారం రాత్రి క‌న్నుమూశారు. ‌ఆమె కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోన్న ఆమె ప‌రిస్థితి విష‌మించ‌డంతో తుది శ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స‌ప్త‌గిరి వెల్ల‌డించారు. బుధ‌వారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కుటుంబస‌భ్యులు తెలిపారు. సప్తగిరి తల్లి మృతిపై పలువురు సినీ ప్ర‌ముఖ‌లు, నెటిజన్లు త‌మ ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు.

- Advertisement -

కాగా సప్తగిరి హీరోగా నటించిన ‘పెళ్లికాని ప్రసాద్’ మూవీ ఇటీవల విడుదలైన మంచి విజయం సాధించింది. స‌ప్త‌గిరి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. బొమ్మరిల్లు చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. అనంతరం పరుగు, గబ్బర్ సింగ్, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ప్రేమ కథా చిత్రమ్ చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News