JETLEE Release Trailer: టాలీవుడ్ కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న చిత్రం జెట్లీ. రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 1న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇప్పటి ఈ సినిమా వచ్చిన ప్రచార పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో సత్య సరసన రియా సింఘా హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ రిలీజ్‌కు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో జెట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఓ ట్రైలర్ రాగా.. తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఫ్లైట్‌లో వచ్చే సీన్స్ ఫుల్ కామెడీని తలపిస్తున్నాయి. ఈ మూవీని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందించారు.
Also Read: RC 17: జూన్ లో చరణ్-సుకుమార్ మూవీ షూటింగ్ స్టార్ట్.. మైత్రీ చెర్రీ క్లారిటీ

