Thursday, July 10, 2025
Homeచిత్ర ప్రభCoolie - WAR 2: కూలీ వ‌ర్సెస్ వార్ 2 క్లాష్‌లో డామినేష‌న్ ఎవ‌రిదంటే?

Coolie – WAR 2: కూలీ వ‌ర్సెస్ వార్ 2 క్లాష్‌లో డామినేష‌న్ ఎవ‌రిదంటే?

Rajinikanth – Aamir Khan – Jr NTR: ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియ‌న్ మూవీస్‌లో ర‌జ‌నీకాంత్ కూలీ, ఎన్టీఆర్ వార్ 2 సినిమాల‌పై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇండియాలోని బిగ్గెస్ట్ సూప‌ర్ స్టార్స్ న‌టించిన ఈ రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. కూలీతో పాటు వార్ 2 ఆగ‌స్ట్ 14న రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ క్లాష్ ఇటూ ద‌క్షిణాదిలో పాటు అటు బాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

ఆమిర్‌ఖాన్‌…నాగార్జున‌…

ర‌జ‌నీకాంత్ కూలీ మూవీకి లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వీరిద్ద‌రి కాంబోలో రూపొందుతోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. ఈ యాక్ష‌న్ మూవీలో ఆమిర్‌ఖాన్‌, నాగార్జున‌, ఉపేంద్ర‌…సౌబీన్ షాహిర్‌… ఒక్కో భాష నుంచి ఒక్కో సార్ట్ హీరో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. వీరితో పాటు శృతిహాస‌న్‌, స‌త్య‌రాజ్‌తో పాటు మ‌రికొంద‌రు పాన్ ఇండియ‌న్ యాక్ట‌ర్స్ కూడా ఈ సినిమాలో న‌టిస్తున్నారు.

ద‌హ పాత్ర‌లో…

కూలీ మూవీతోనే బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్‌ఖాన్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ద‌హ అనే క్యారెక్ట‌ర్‌లో ఆమిర్‌ఖాన్ క‌నిపించ‌బోతున్నాడు. అత‌డి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ ఇటీవ‌ల రిలీజ్ చేశారు. ర‌జ‌నీకాంత్‌తో పాటు నాగార్జున‌కు బాలీవుడ్‌లో కాస్తో కూస్తో మార్కెట్‌ ఉంది. ఆమిర్ ఖాన్ స్పెష‌ల్ రోల్‌తో బాలీవుడ్‌లో కూలీ సినిమాకు మంచి క్రేజ్‌, బ‌జ్ ఏర్ప‌డింది. ప్రీ రిలీజ్ బిజినెస్‌తో పాటు ఓపెనింగ్స్‌లో కూలీ మూవీ రికార్డులు క్రియేట్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

బాలీవుడ్ ఎంట్రీ…

బాలీవుడ్ మూవీ వార్ 2 లో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్నారు. వార్ మూవీకి సీక్వెల్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ఆయాన్ ముఖ‌ర్జీ డైరెక్ట‌ర్‌. దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌ల రిలీజైన టీజ‌ర్‌లో హృతిక్ ధీటుగా త‌న స్క్రీన్‌ప్ర‌జెన్స్‌, యాక్టింగ్‌తో ఎన్టీఆర్ ఆక‌ట్టుకున్నాడు.

వంద కోట్లు…

వార్ 2 మూవీకి తెలుగుతో పాటు బాలీవుడ్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్ హైలో ఉన్నాయి. వార్ 2 తెలుగు డ‌బ్బింగ్ రైట్స్ టాలీవుడ్ టాప్ బ్యాన‌ర్స్ పోటీప‌డుతోన్నాయి. తెలుగు థియేట్రిక‌ల్ రైట్స్ వంద కోట్ల‌కుపైనే ప‌లుకుతున్న‌ట్లు తెలిసింది.

ALSO READhttps://teluguprabha.net/cinema-news/nithiin-latest-movie-thammudu-day-1-collections/

పోటీ క‌ష్ట‌మే…

వార్ 2, కూలీ బాక్సాఫీస్ క్లాష్ వ‌ల్ల రెండు సినిమాల‌కు న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. వార్ 2 మూవీని య‌శ్‌రాజ్ సంస్థ నిర్మిస్తోంది. వార్ 2ను కాద‌ని హిందీలో కూలీకి థియేట‌ర్లు దొర‌క‌డం క‌ష్ట‌మేన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నార్త్‌లోని చాలా వ‌ర‌కు ఐమాక్స్ స్క్రీన్స్ మొత్తం వార్ 2కే కేటాయించారు. సింగిల్ స్క్రీన్స్ కూడా కూలీకి త‌క్కువే దొరికే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ ఉన్న క్రేజ్ దృష్ట్యా కూలీపై వార్ 2దే డామినేష‌న్ క‌నిపించేలా ఉంది. ఒక్క త‌మిళంతో మాత్రం ర‌జ‌నీకాంత్ హ‌వాను త‌ట్టుకొని వార్ 2 నిల‌బ‌డ‌టం క‌ష్టమ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News