Friday, February 13, 2026
Homeచిత్ర ప్రభThe Raja Saab: రాజా సాబ్ ఎఫెక్ట్.. చెప్పు చూపించాడే.. తమన్ ఏం రిప్లై ఇస్తాడో...

The Raja Saab: రాజా సాబ్ ఎఫెక్ట్.. చెప్పు చూపించాడే.. తమన్ ఏం రిప్లై ఇస్తాడో చూడాలి

The Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఈ మూవీకి అనుకున్నంత పాజిటివ్ టాక్ రాకపోవడంతో కలెక్షన్స్ అంతగా వస్తాయా? లేదా? అన్నది ప్రస్తుతం ట్రేడ్ సర్కిళ్లలో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇలా ఉంటే రాజా సాబ్ కోసం తమన్ కంపోజ్ చేసిన ఓ పాట మీద కాపీ మరక అంటింది. సదరు విదేశీ కంపోజర్ మాత్రం చెప్పు చూపించి మరీ ట్వీట్ వేశాడు. దీనిపై తమన్ ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి. మామూలుగా అయితే తమన్ నెట్టింట్లో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. మరి ఈ విమర్శలకు ఎలాంటి బదులిస్తాడో.

- Advertisement -

ఇక రాజాసాబ్ మూవీ మీద వస్తున్న విమర్శలు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌ని కలవరపెడుతున్నాయి. ప్రభాస్ స్టార్‌డమ్‌ని మారుతి సరిగ్గా వాడుకోలేదని అంతా అంటున్నారు. ప్రభాస్‌కి సరిపడే కథ కాదని, ప్రభాస్‌ని సరిగ్గా వాడుకోలేకపోయాడని అంతా మారుతిని విమర్శిస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ మూడు రోజులు రాజా సాబ్ మేనియాలోనే ఉండేలా కనిపిస్తున్నారు.

Also Read – The Raja Saab Collections: ‘ది రాజా సాబ్’ ఫస్ట్ డే కలెక్ష‌న్స్‌.. రూ.100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిన ప్ర‌భాస్‌

సంక్రాంతి సీజన్ కాబట్టి ఎలాగూ రాజా సాబ్ మూవీతో ఓపెనింగ్స్ స్టార్ట్ అయ్యాయి. చిరంజీవి, వెంకీ ద్వయంతో అనిల్ రావిపూడి సృష్టించిన వినోదాత్మక చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు థియేటర్లోకి వచ్చే టైంకి రాజా సాబ్ కాస్త డల్ అయ్యేలా కనిపిస్తున్నాడు. మౌత్ టాక్ కాస్త డల్‌గా ఉండటం, నెగెటివ్ టాక్ రావడం వంటి వాటితో రాజా సాబ్ మీద ప్రభావం కనిపించేలా ఉంది.

ఇలాంటి టైంలో రాజా సాబ్ మీద ఓ విదేశీ వ్యక్తి డీజే వీడోజీన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాజా సాబ్ బాగానే ఉంది. అయితే నాచే నాచే పాటను కాపీ చేయడం ఏమీ బాగా లేదు.. అంటూ తమన్ గురించి నెగెటివ్‌గా ట్వీట్ వేస్తూ చెప్పులు చూపించాడు. మరి ఇప్పుడు వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. అసలే ఘాటుగా రిప్లైలు ఇచ్చే తమన్ ఈ ట్వీట్ మీద ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Also Read – The Rajasaab Ott: ‘రాజా సాబ్’ ఓటీటీ అప్డేట్.. ఎప్పుడు? ఎక్కడంటే?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News