Jana Nayagan: దళపతి విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’కు న్యాయపరమైన ఊరట లభించింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట నారాయణ నిర్మించిన ఈ సినిమా ముందుగా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం కావడంతో సినిమా విడుదల నిలిచిపోయింది. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో అడుగుపెట్టనున్న విజయ్‌కు ఇది చివరి సినిమాగా ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా ‘జన నాయగన్’పై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ అంశంపై చిత్ర యూనిట్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేసును విచారించిన సింగిల్ బెంచ్, సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. సెన్సార్ పూర్తయ్యాక మళ్లీ రివ్యూ కమిటీకి ఎందుకు పంపారంటూ హైకోర్టు CBFCను ప్రశ్నించడం ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం. అయితే ఈ తీర్పుపై CBFC అత్యవసర విచారణ కోసం మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై శనివారం లేదా సోమవారం తీర్పు వెలువడే అవకాశముందని సమాచారం. తాజా పరిణామాలతో ‘జన నాయగన్’ విడుదలకు లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తున్నా.. అత్యవసర పిటిషన్‌పై తుది తీర్పు రావాల్సి ఉండటంతో ఇంకా కొంత సస్పెన్స్ కొనసాగుతోంది.
Also Read – Maa Inti Bangaram Teaser: సమంత కమ్‌బ్యాక్ అదుర్స్ – మా ఇంటి బంగారం యాక్షన్ ప్యాక్‌డ్ టీజర్ రిలీజ్
ఈ నేపథ్యంలో మేకర్స్ జనవరి 14న సినిమాను విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టు నుంచి మరింత క్లారిటీ వచ్చిన వెంటనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ‘జన నాయగన్’ చిత్రం తెలుగులో వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు తమిళ రీమేక్. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ మరో ముఖ్య పాత్ర పోషించారు.
Also Read – RajaSaab Part2: ప్రభాస్ రాజాసాబ్ సీక్వెల్ కన్ఫామ్ – టైటిల్ ఇదే

