Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభNagarjuna : మరోసారి బిగ్‌బాస్‌పై ఫైర్ అయిన నారాయణ.. దారుణంగా వ్యాఖ్యలు..

Nagarjuna : మరోసారి బిగ్‌బాస్‌పై ఫైర్ అయిన నారాయణ.. దారుణంగా వ్యాఖ్యలు..

- Advertisement -

Nagarjuna : హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి, బాలీవుడ్ నుంచి సౌత్ కి దిగుమతి అయిన షో బిగ్‌బాస్. ఒక హౌజ్ లో కొంతమంది మామూలు సెలబ్రిటీలని కొన్ని రోజుల పాటు ఉంచి వాళ్లకి టాస్కులు ఇస్తూ ఉంటారు. ఈ షో బాగానే సక్సెస్ అవుతూ వస్తుంది. కొంతమంది దీనికి సపోర్ట్ గా ఉంటే కొంతమంది మాత్రం షోని విమర్శిస్తున్నారు.

బిగ్‌బాస్ హౌజ్ లో అమ్మాయిలు, అబ్బాయిలని పెట్టి సమాజానికి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ, ప్రజలని ఈ షో ద్వారా తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కొంతమంది విమర్శించారు. ఇక తెలుగు బిగ్‌బాస్ ని, నాగార్జునని కూడా చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సిపిఐ పార్టీ నాయకుడు నారాయణ అయితే ఇప్పటికే చాలా సార్లు బిగ్‌బాస్ హౌజ్ ని విమర్శించారు.

నారాయణ గతంలో బిగ్‌బాస్ ని బ్యాన్ చేయాలని, అదొక బ్రోతల్ హౌజ్ అని, నాగార్జునపై కేసు వేయాలని, ఇలా అనేక రకాలుగా విమర్శించారు. తాజాగా మరోసారి బిగ్‌బాస్ పై నారాయణ వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన సమావేశంలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అనేది సాంఘిక దురాచారంతో కూడుకున్న షో. అదొక క్యాన్సర్ లాంటిది. దాన్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందే అంటూ మరోసారి కామెంట్స్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News