శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘గేమ్ ఛేంజర్'(Game Changer) మూవీ టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. తొలిరోజు రూ. 186 కోట్లకు పైగా వసూళ్లు (గ్రాస్) సాధించినట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ మొదటి రోజు వసూళ్లు రూ. 294కోట్లకు ఈ మూవీ వసూళ్లు చాలా దూరంలో ఉండిపోయాయి. దాదాపు రూ.100కోట్లు వెనుకంజలో ఉంది. కానీ ఎన్‌టీఆర్ ‘దేవర’ తొలిరోజు కలెక్షన్స్ రూ.172కోట్లను మాత్రం బ్రేక్ చేసింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇంటి వద్ద మెగా అభిమానులు సందడి చేశారు. బ్యాండ్ మోతలు, టపాసులు పేలుస్తూ, గ్లోబల్ స్టార్ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా అభిమానులకు చెర్రీ బాల్కనీ నుంచి అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.