నటసింహం బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj)సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సినిమాలో బాలయ్య డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, థమన్ బీజీఎం గూస్ బంప్స్ తెప్పించాయి. సరికొత్త అవతారంలో బాలయ్య కనిపించడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. రూ.170కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలయ్య కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంతో వరుసగా నాలుగు రూ.100కోట్ల మూవీలు రాబట్టిన సీనియర్ హీరోగా బాలయ్య రికార్డు సృష్టించారు. అంతకుముందు అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేశాయి.
థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీ ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఫిబ్రవరి 21 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్(Netflix) వేదికగా తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం విధితమే. తొలివారంలో 2.4 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రెండో వారంలో 2.6 మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 10లో ట్రెండింగ్ అవుతోంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో అయితే టాప్ 1లో, UAE తో పాటు బెహ్రెయిన్‌లో 2వ స్థానంలో నిలిచింది. ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటించేందుకు రెడీ అయ్యారు.