నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), దర్శకుడు బాబీ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లగా నటిస్తుండగా.. బాబీ డియోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ మూవీ ట్రైలర్(Daaku Maharaaj Trailer) విడుదలైంది. ‘‘అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డవాళ్లంతా ఆయన్ని డాకు అనేవాళ్లు. మాకు మాత్రం మహారాజు’’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్ మొదలైంది. బాలయ్య నటన, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ప్రదర్శన, సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.