నటసింహం బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj)సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమాలో బాలయ్య డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, థమన్ బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దీంతో మూవీ చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.56 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో రోజు కలెక్షన్లను మూవీ యూనిట్ ప్రకటించింది. రెండు రోజుల్లో రూ.74 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది అని ఓ కొత్త పోస్టర్ షేర్ చేసింది.
రెండు రోజుల్లోనే రూ.74 కోట్లు రావడంతో సంక్రాంతి సెలవులు అయ్యే లోపు బ్రేక్ ఈవెన్ అయి లాభాల్లోకి వచ్చేస్తుందని భావిస్తున్నారు. దీంతో అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాల హ్యాట్రిక్ తర్వాత డాకు మహారాజ్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. మూవీకి బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు.