Wednesday, January 14, 2026
Homeచిత్ర ప్రభD Suresh Babu: నిర్మాత సురేశ్ బాబు సీరియస్.. తప్పుగా రాస్తే చర్యలు తప్పవని వార్నింగ్

D Suresh Babu: నిర్మాత సురేశ్ బాబు సీరియస్.. తప్పుగా రాస్తే చర్యలు తప్పవని వార్నింగ్

Daggubati Suresh Babu: దగ్గుబాటి కుటుంబంపై ఇటీవల ప్రచారంలోకి వచ్చిన తప్పుడు వార్తలను ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు తీవ్రంగా ఖండించారు. ఈ జనవరి 2న ఆయన న్యాయస్థానంలో తప్పనిసరిగా హాజరుకావాలనే కథనాలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను వక్రీకరించి నిరాధారమైన వార్తలు ప్రచురించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.

- Advertisement -

తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని న్యాయస్థానం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని సురేశ్ బాబు పేర్కొన్నా. అలాగే నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీకి ఎలాంటి కారణాలు లేవని కూడా కోర్టు పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. అయినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు సంచలనాత్మకంగా కథనాలు ప్రచురించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు.

Also Read – The Raja Saab: రాజా సాబ్ ఎఫెక్ట్.. చెప్పు చూపించాడే.. తమన్ ఏం రిప్లై ఇస్తాడో చూడాలి

ఇలాంటి తప్పుడు ప్రచురణలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సురేశ్ బాబు.. భవిష్యత్తులోనూ ఇలాంటి వార్తలు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టంగా హెచ్చరించారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అధికారికంగా సమాచారాన్ని తీసుకున్న తర్వాతే కథనాలు ఇవ్వాలన్నారు. తమపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామనే విషయం ఎక్కడా ప్రస్తావనకే రాలేదని ఆయన స్పష్టం చేశారు.

గతంలోనూ తప్పుడు ప్రచారాలు..
ఇది తొలిసారి కాదని సురేశ్ బాబు గుర్తు చేశారు. 2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమయంలో తన కుమారులు రానా, అభిరామ్‌లకు ఆ కేసుతో సంబంధం ఉందన్న పుకార్లు వచ్చినప్పుడు కూడా వాటిని ఖండించిన విషయం గుర్తు చేశారు. అలాగే భూ వివాదాలపై వచ్చిన కొన్ని వార్తలు తమ వ్యక్తిగత అంశాలకు సంబంధించినవని, వాటిని చట్టబద్ధంగా పరిష్కరించుకుంటామని అప్పట్లోనే స్పష్టం చేశామని తెలిపారు.

Also Read – The Raja Saab Collections: ‘ది రాజా సాబ్’ ఫస్ట్ డే కలెక్ష‌న్స్‌.. రూ.100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిన ప్ర‌భాస్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News