Friday, November 8, 2024
Homeచిత్ర ప్రభDasara celebrations in Film Nagar cultural centre: ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్...

Dasara celebrations in Film Nagar cultural centre: ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో దసరా

దాండియా ఆటలు ఆడ..

ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ హైదరాబాద్ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా దసరా ఉత్సవాలు

- Advertisement -

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ హైదరాబాద్ వారు బతుకుమ్మా, దాండియా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళా సభ్యులు ఎంతో మంది స్వయంగా పాల్గొని బతుకమ్మ ఆడి, దాండియాలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, సెక్రెటరీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ సదాశివరెడ్డి, ట్రెజరర్ శైలజ జూజాల, కమిటీ మెంబర్లు ఏడిద రాజా, కాజా సూర్యనారాయణ, మురళీమోహన్ రావు, వీ.వీ.జి. కృష్ణంరాజు, భాస్కర్ నాయుడు, నవ కాంత్, బాలరాజు,వరప్రసాదరావు, భవానీ వంటివారు ఈ కార్యక్రమం ఏర్పాట్లు దగ్గరుండి చేశారు.

ఇక కల్చరల్ కమిటీ కన్వీనర్ ఏడిద రాజా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇక సాంస్కృతిక శాఖకు చెందిన డాక్టర్ కే వెంకటేశ్వర్ రావు గారు, ఏ. గోపాలరావు కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News