ఈరోజు ఎపిసోడ్‌లో దీప గదిలోని బీరువా తీసి చూస్తే అక్కడ డబ్బులు చూసి షాక్ అవుతుంది. ఈ డబ్బులు ఎక్కడిది అని కార్తీక్‌ని అడుగుతుంది. మనవే ఫ్రెండ్ దగ్గర అప్పుగా తీసుకున్నాను అంటాడు. ఈ డబ్బుతో రెస్టారెంట్ పెడతారా అని అడుగుతుంది. ఈ రూ.5 లక్షలు సరిపోతాయా అని అడిగుతుంది. ఇంకా ఎన్నో ప్రశ్నలు వేస్తుంటే కార్తిక్ ఏదేదో సమాధానం చేప్తే మీరు అబద్దం చెప్తున్నారు అంటుంది. మీరు ఏదైనా చేస్తే చెప్పకుండా చేయరు చెప్పకుండా ఇప్పుడు వచ్చి ఇంట్లో డబ్బు పెట్టారు అని ప్రశ్నలు వేస్తుంది. అప్పుడు దీప మీద సీరియస్ అవుతాడు కార్తీక్. ఇంతలో ఏమైందని కాంచన వచ్చి అడుగుతుంది. అప్పుడు మాట మార్చి దాసు కనిపించట్లేదు ని చెప్తాడు. కాంచన వెళ్లిపోయాక మళ్లీ ఆ డబ్బు గురించి అడగడంతో మీరు అన్ని అబద్ధాలే చెబుతున్నారు అంటే అవును అన్నీ అబద్దాలే అని కోపంగా చెప్తాడు.
తలనెప్పిగా ఉంది కాఫీ ఇస్తావా అంటే తేవడానికి వెళ్తుంది అప్పుడు కార్తిక్ సారీ దీప బాదో, బాధ్యతో తెలీదు అన్నీ నేనే మోస్తాను అని మనసులో అనుకుంటాడు. మరోవైపు శ్రీధర్ తనని తనే అద్దంలో చూసుకుని రెండు పెళ్లిళ్లు చేసుకున్న వాడా ఎన్ని చేసుకుంటే ఏంటి ఒక ముద్దు ముచ్చట లేదు అనుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. ఇంతలో కావేరి వచ్చి పదండి స్వప్న ఇంటికి వెళ్లాలి దాసు కనిపించట్లేదు అంట అనడంతో ఎవరింటికి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు అంటాడు.
అక్కడ కాశీ స్వప్న, దీప ముగ్గురూ కలిసి దాసు గురించి మాట్లాడుకుంటారు. వాళ్లకు దీప దైర్యం చెప్తుంది. స్వప్న లోపలికి వెళ్తే కాశీ దగ్గర కార్తీక్ రూ.5 లక్షలు తెచ్చిన విషయం గురించి దీప మాట్లాడి నీకు తెలుసా ఎక్కడి నుంచి తెచ్చారో ఎందుకు తెచ్చారో కనుక్కో అంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి వారి మాటలు విని కాశీ నిజం చెప్పస్తాడేమో అని కంగారు పడతాడు. ఇంతలో పోలీసులు ఫోన్ చేసి దాసు హాస్పిటల్‌లో ఉన్నాడని చెప్పారు. కాశీ, కార్తిక్ హాస్పిటల్‌కు వెళ్తారు. అక్కడ పారిజాతంకు దాసు గురించి చెప్తే ఇంట్లో వాళ్లందరికి చెప్తుంది. ఆ మాటలకు జోత్స్న కంగారు పడుతుంది. అప్పుడు పారిజాతం హాస్పిటల్‌కు వెళ్తుంటే నేను వస్తాను అని జోత్స్న వెళ్తుంది. కాశి, కార్తిక్ దాసుని చూసి షాక్ అవుతాడు. ఇంటికి తీసుకెళ్లిన దాసును చూసి పారిజాతం ఏడుస్తుంది. పారిజాతం దాసుకు ఇలా చేసిన వాళ్ల కాళ్లు, చేతులు విరిగిపోను అని అంటుంటే తిడితే బాబాయికి నయం కాదు కదా అంటుంది జోత్స్న. అప్పుడు కార్తిక్ వరసలు బాగానే గుర్తుఉన్నాయే అంటాడు.