Homeచిత్ర ప్రభAllu Arjun: ఢిల్లీ హైకోర్టులో అల్లు అర్జున్‌కి ఊరట

Allu Arjun: ఢిల్లీ హైకోర్టులో అల్లు అర్జున్‌కి ఊరట

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి అనుమతి లేకుండా ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో వీడియోలు, ఫోటోలు ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. అంతేకాకుండా నుమతి లేకుండా బన్నీ గొంతు, హావభావాలను అనధికార వాణిజ్య ప్రకటనల్లో వాడటకూడదని పేర్కొంది. ఎవరైనా సరే సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.

- Advertisement -

చిరంజీవి, అమితాబ్ కూడా
ఈ సందర్భంగా ప్రతివాదులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా గతంలోనూ తమ వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం చాలామంది సినీ సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి, అభితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ వంటి స్టార్‌ హీరోలు తమ అనుమతి లేకుండా ఇష్టమొచ్చినట్లుగా ఫోటోలు వాడుతున్నారని పిటిషన్స్ దాఖలు చేశారు. వీరందరి హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అల్లు అర్జున్‌కు కూడా ఈ అంశంలో ఢిల్లీ హైకోర్టు ఊరట ఇచ్చింది.

Also Read: Peddi: ‘పెద్ది’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్‌.. మరో ఆరు రోజుల్లో..

రాకాతో బిజీ
ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీతో దర్శకతంలో ఓ భారీ పాన్‌ వరల్డ్‌ సినిమా చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా రాకా అనే టైటిల్‌ ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి విడుదలైన బన్నీ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షక అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. అంతే కాకుండా రష్మికతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్‌ కూడా రాకాలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ని జరుపుకుంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News