Friday, December 12, 2025
Homeచిత్ర ప్రభDevara Part 2: దేవర పార్ట్ 2 పోస్ట్‌పోన్.. ప్రశాంత్ నీల్ సినిమా వల్లనా?

Devara Part 2: దేవర పార్ట్ 2 పోస్ట్‌పోన్.. ప్రశాంత్ నీల్ సినిమా వల్లనా?

Devara Part 2: కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన దేవర పార్ట్ 1లో క్లైమాక్స్ చూశాక, పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు, అయితే రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో ఒక న్యూస్ ట్రెండ్ అవుతోంది.. దేవర 2 ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేస్తున్నారంట! ఈ వార్తతో ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. అసలు కథ మొదలయ్యే టైంలో ఇలా ఆపేస్తే ఎలా అని తెగ డిసప్పాయింట్ అవుతున్నారు. నిజానికి, మేకర్స్ నుంచి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అఫీషియల్ క్లారిటీ రాలేదు. అయినా సరే, ఈ రూమర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్‌కు ఏం అర్థం కాక తెగ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు!

- Advertisement -

ALSO READ: Allu Arjun: లోకేష్ యూనివర్స్‌లో అడుగుపెట్టిన బన్నీ!

దేవర 2 ఆగిపోవడానికి రెండు మెయిన్ రీజన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి, డైరెక్టర్ కొరటాల శివ ఇచ్చిన కొత్త స్టోరీ నరేషన్ మన తారక్ కి అంతగా కనెక్ట్ అవ్వలేదంట. పార్ట్ 1 హిట్టయిన తర్వాత, పార్ట్ 2 ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి కాబట్టి, కథలో ఏదో మిస్సింగ్ ఉందని ఎన్టీఆర్ ఫీలయ్యాడంట. రెండోది, తారక్ ఆల్రెడీ ప్రశాంత్ నీల్ సినిమాతో కమిట్ అయిపోయాడు. అది కూడా భారీ ప్రాజెక్ట్ కాబట్టి, దాని కోసం ఎక్కువ టైమ్ కేటాయించాల్సి వస్తుందని, అందుకే దేవర 2 పనులకు ఇప్పుడప్పుడే టైమ్ సెట్ కాలేదని అంటున్నారు. ఈ గ్యాప్ వల్లే ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయిందని టాక్.

దేవర పార్ట్ 1 చూసిన వాళ్లకి తెలుసు, ఆ సినిమాలో సముద్రం సీన్స్, పవర్ ఫుల్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో. ముఖ్యంగా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, స్టోరీ ఎండింగ్‌లో పెట్టిన ట్విస్ట్ పార్ట్ 2పై ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఆకాశానికి చేర్చింది. అందుకే, ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందని వినగానే, దేవర కథ ఎప్పుడు చూస్తాం? క్లైమాక్స్ ట్విస్ట్ సస్పెన్స్ ఎప్పుడు తెలుస్తుంది? అంటూ ఫ్యాన్స్ అందరూ చాలా ఫీల్ అవుతున్నారు. అయితే, గతంలో మేకర్స్ గ్యారెంటీగా పార్ట్ 2 ఉంటుంది అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. తారక్ కూడా కథ ఇంకాస్త పవర్‌ఫుల్గా రావడానికి కొంచెం బ్రేక్ తీసుకుంటున్నామని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ రూమర్స్ ఎందుకు వచ్చాయో ఎవరికీ అర్థం కావట్లేదు.

ALSO READ: Paanch Minar OTT: రాజ్ తరుణ్ పాంచ్ మినార్.. వారం రోజుల్లోనే ఓటీటీలో!

ప్రస్తుతం దేవర 2 ఆగిపోయిందనేది కేవలం రూమర్ మాత్రమేనా, లేక కథ కోసం నిజంగానే లాంగ్ బ్రేక్ తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఫ్యాన్స్ ఇంతలా అడుగుతున్నప్పుడు, కచ్చితంగా చిత్ర యూనిట్ దీనిపై త్వరలోనే ఒక అఫీషియల్ అప్‌డేట్ ఇవ్వాలి. కథ విషయంలో తారక్ అండ్ టీమ్ కాల్  తీసుకునే అవకాశం ఉంది. సీక్వెల్ మాత్రం పక్కాగా తీయాలని టీమ్ కూడా అనుకుంటోంది. అందుకే, ఈ విషయంలో ఫైనల్ డెసిషన్ కోసం మనం మేకర్స్ నుంచి వచ్చే అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేయాల్సిందే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News